Bharat Bandh: నేడు భారత్ బంద్.. సమ్మెలో ఎవరు పాల్గొంటున్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Bandh: దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ బంద్‌లో పాల్గొనబోతునట్లు సమాచారం. ఈ బంద్ పిలుపు 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చాయి. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతుల అభ్యున్నతికి విరుద్ధంగా ఉన్న నిర్ణయాలు, కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలకు నిరసనగా ఈ బంద్ చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఒక ప్రకటనలో కోరింది.
Read Also:Nimisha Priya: యెమెన్ లో భారతీయ నర్సుకు ఉరి శిక్ష తేదీ ఖరారు.. నేరం ఏంటి..?
Also Read
- Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
- Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
బంద్‌లో ఎవరు పాల్గొంటున్నారు?
బ్యాంకింగ్, బీమా, పోస్టల్, మైనింగ్, నిర్మాణ రంగాలతో పాటు రాష్ట్ర రవాణా, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. అనధికారిక లేదా అసంఘటిత రంగాల యూనియన్లు కూడా ఈ సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం అవుతాయని ప్రకటించారు. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత అమర్జిత్ కౌర్ ప్రకారం.. రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా రాబోతున్నారు.
ఈ సమ్మెలో పాల్గొంటున్న కార్మిక సంఘాలు ప్రధానంగా నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు భర్తీ చేయడం, కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టించడం, అలాగే MNREGA వేతనాల పెంపు, పని దినాల పెంపు, ఇంకా పట్టణాల్లో కూడా ఈ తరహా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం వంటి విషయాలపై డిమాండ్లను ఉంచాయి.
Read Also:AI+ Smartphone Launch: మార్కెట్లోకి దేశీ స్మార్ట్‌ఫోన్.. బెస్ట్ ఫీచర్స్, ధర కేవలం 5 వేలే!
ప్రజా సేవలపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ బంద్ కారణంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, రాష్ట్ర రవాణా వంటి సేవలు ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే, బ్యాంకులు పూర్తిగా మూసివేయబడతాయా..? లేదా..?, రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుందా అనే అంశాల్లో స్పష్టత లేదు. బ్యాంకింగ్, రైల్వే యూనియన్లు ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించలేదు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగా పనిచేసే అవకాశమున్నప్పటికీ.. బస్సులు, టాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్ సేవలు తదితర ప్రజా రవాణా సేవలపై ప్రభావం తప్పదు.
తాజావార్తలు
-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
-
Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!