WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, ఈ WTC లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌కు ఇది 5వ ఓటమిగా నమోదైంది. కేవలం 19.05 శాతం పాయింట్లతో పాకిస్థాన్ చివరి స్థానమైన 9వ స్థానానికి దిగజారింది. దీంతో వెస్టిండీస్ (20.83 శాతం పాయింట్లు) 8వ స్థానంలో నిలవగా, విజయం సాధించిన ఇంగ్లాండ్ 29.76 శాతం పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇరు జట్లు ఇప్పటికే WTC ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి.
మరోవైపు ఆస్ట్రేలియా 77.78 శాతం పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75 శాతం), న్యూజిలాండ్ (72.22 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 53.33 శాతం పాయింట్లతో 5వ స్థానంలో, బంగ్లాదేశ్ 66.67 శాతం పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంకపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోతే, భారత్ 57.57 శాతం పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంటుంది. అప్పుడు బంగ్లాదేశ్ పాయింట్ల శాతం 55.55 శాతానికి పడిపోతుంది.
Also Read
పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 409 పరుగులు చేసి 238 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన ఇంగ్లాండ్, రెండవ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ను కేవలం 135 పరుగులకే కుప్పకూల్చింది. జోఫ్రా ఆర్చర్, ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్ , గుస్ అట్కిన్సన్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. రాబిన్సన్ , టంగ్ ఈ మ్యాచ్‌లో చెరో 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఘనవిజయానికి కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!