Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmastra 2: 2022లో దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా, షారుఖ్ ఖాన్ ప్రత్యేక కామియో పాత్రలో మెరిశారు. ఈ హిట్ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ‘బ్రహ్మాస్త్ర 2’ పనులను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. రణబీర్ కపూర్ హీరోగా రూపొందనున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రణబీర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం పార్ట్ 2’ షూటింగ్ ను రణబీర్ కపూర్ 2027 జనవరి నాటికి పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027 ఏప్రిల్‌లో ‘బ్రహ్మాస్త్ర 2’ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ టైమ్‌లైన్‌పై చిత్రబృందం నుంచి ఇంకా ప్రకటన అయితే వెలువడలేదు. ఈ సీక్వెల్లో రణబీర్ కపూర్ శివుడితో పాటు దేవ్ పాత్రను కూడా పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో దేవ్ పాత్రను పూర్తిగా చూపించకపోవడంతో, రెండో భాగంలో ఆ పాత్ర హైలెట్ గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
మరోవైపు ఆలియా భట్ కూడా ‘ఇషా’ పాత్రలో తిరిగి కనిపించనున్నట్లు సమాచారం. మొదటి భాగంలో శివ, ఇషా మధ్య లవ్ స్టోరీకి ఇందులో ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, రెండో భాగంలో కూడా అదే హైప్ లో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అంశం అమృత పాత్ర. ఆ పాత్ర కోసం దీపికా పడుకొణేతో అయాన్ ముఖర్జీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
ఇదిలా ఉండగా, రణబీర్ కపూర్ తదుపరి ప్రాజెక్టులపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘ధూమ్ 4’ వంటి ఇతర సినిమాలపై వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ‘రామాయణం’ పూర్తయ్యాక ‘బ్రహ్మాస్త్ర 2’కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయాన్ ముఖర్జీ, రణబీర్ కపూర్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తతో ‘బ్రహ్మాస్త్ర 2’పై అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేవ్, శివ పాత్రల చుట్టూ కథ ఎలా మలుపు తిరుగుతుందో, అమృత పాత్రలో నిజంగా ఎవరు కనిపిస్తారో అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
- Tags
- Brahmastra 2
- cinema
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు