Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
- Vivo T5 5G
- భారత్‌లో త్వరలో లాంచ్
- 7.99mm స్లిమ్ డిజైన్, 3D కర్వ్డ్ డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo T5 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో T-సిరీస్ ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే Vivo T5 Lite 5G, Vivo T5x 5G, Vivo T5 Pro 5G వంటి ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ.. ఇప్పుడు Vivo T5 5Gను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్
Vivo T5 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా టీజ్ చేసింది. ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లను కూడా వెల్లడించింది. ముఖ్యంగా 3D కర్వ్డ్ డిస్ప్లే, AI సామర్థ్యాలు, సన్నని డిజైన్‌పై వివో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, Vivo T5 5G OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనుంది. ఇందులో GenAI-ready NPU ఉండనున్నట్లు కూడా టీజ్ చేసింది. దీంతో AI ఆధారిత ఫీచర్లకు ఈ ఫోన్ మెరుగైన సపోర్ట్ అందించే అవకాశం ఉంది.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
3D కర్వ్డ్ డిస్ప్లే
Vivo T5 5Gలో 3D కర్వ్డ్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కర్వ్డ్ డిస్ప్లేతో పాటు ఫోన్ చాలా సన్నగా ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ టీజ్ చేసింది. రిపోర్టుల ప్రకారం ఈ ఫోన్ 7.99mm అల్ట్రా-స్లిమ్ ఫ్రేమ్ తో రావచ్చని తెలుస్తోంది. అయితే డిస్ప్లే పరిమాణం, రిజల్యూషన్, రిఫ్రెష్ రేట్ వంటి పూర్తి వివరాలను వివో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
Vivo T5 5G ధర ఎంత?
Vivo T5 5G ధరపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న అంచనాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.34,999 నుంచి రూ.49,999 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఇది కేవలం అంచనా ధర మాత్రమే. అధికారిక లాంచ్ సమయంలో వివో ధరను వెల్లడించాల్సి ఉంటుంది.
లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు
Vivo T5 5Gను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. లాంచ్ తేదీతో పాటు ఫోన్‌కు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్లు, కెమెరా వివరాలు, ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యం వంటి వివరాలను వివో త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
Vivo T5 Pro 5G ధర పెంపు
ఇదిలా ఉండగా, వివో ఇటీవల Vivo T5 Pro 5G ధరను పెంచింది. ఈ ఫోన్ ధరను వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.7,000 వరకు పెంచింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కొత్త ధర రూ.41,999గా ఉంది. ఈ మోడల్‌ను మొదట రూ.29,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. అదేవిధంగా 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర కూడా రూ.7,000 పెరిగి రూ.46,999కు చేరింది. 12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.69,999గా ఉంది.
తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?