Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?

  • అసెంబ్లీకి తాగి వచ్చిన సీఎం భగవంత్ మాన్.?
  • సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్, అకాలీ దళ్..
Punjab Cm

Punjab Cm

Bhagwant Mann: కార్మిక దినోత్సవం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పంజాబ్‌లో సంచలనంగా మారాయి. ఈ సమావేశాల సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో పంజాబ్ అసెంబ్లీలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ముఖ్యమంత్రి మద్యం మత్తులో అసెంబ్లీకి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించడంతో వివాదం ఏర్పడింది. ఎమ్మెల్యేలందరికి ఆల్కాహాల్ మీటర్ టెస్ట్ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా డిమాండ్ చేశారు.

Read Also: Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్

శిరోమణి అకాలీ దళ్ కూడా ముఖ్యమంత్రి మాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. కార్మిక దినోత్సవం రోజు భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి రావడం చాలా సిగ్గుచేటు అని ఆ పార్టీ పేర్కొంది. సభలో ముఖ్యమంత్రి తీరును ప్రజలు గమనించాలని అన్నారు. నిజం బయటపెట్టేందుకు పంజాబ్ సీఎంకు ప్రజల ముందు డోప్ టెస్ట్ నిర్వహించాలని అకాలీ దళ్ డిమాండ్ చేసింది.

ఇటీవల ఆప్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో కలకలం చెలరేగింది. తాజాగా సీఎం భగవంత్ మాన్‌పై ఇలాంటి విమర్శలు రావడంతో మరోసారి ఆ పార్టీ వివాదంలో చిక్కుకుంది. ఈ ఆరోపణలపై భగవంత్ మాన్ స్పందిస్తూ, ప్రత్యేక సమావేశం కార్మిక దినోత్సవానికి అంకితమని, సభ్యులందరూ వాదనలకు దూరంగా ఉండి సభలో హుందాతనాన్ని పాటించాలని కోరారు.