Instagram Star Murder: భర్త చేతితో ఇన్‌స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Star Murder: భార్య ఎదుగుతుంటే చూసి మురిసిపోవాల్సిన భర్త.. ఆమె పాపులారిటీని చూసి అసూయతో రగిలిపోయాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా లక్షలాది మంది అభిమానాన్ని పొందిన నాగలక్ష్మి.. తన సొంత భర్త చేతిలోనే బలయ్యారు. చెన్నై నంగనల్లూరులో జరిగిన ఫ్యాషన్ డిజైనర్ నాగలక్ష్మి హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక భర్త సుబ్రహ్మణ్యం ఈగో సమస్య ప్రధాన కారణమని తెలుస్తోంది. నంగనల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం(52), నాగలక్ష్మి(42) దంపతులు గత కొంతకాలంగా గొడవ పడుతున్నారు. ఆమె పెద్ద కుమారుడు రష్యాలో ఎంబీబీఎస్ చదువుతుండగా, చిన్న కుమారుడు చెన్నైలో డెంటల్ కోర్సు చేస్తున్నాడు.
Also Read
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన నాగలక్ష్మి.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఆమె డిజైన్లు, చీరలు కట్టుకునే విధానానికి ఫిదా అయిన సుమారు 3 లక్షల మంది ఫాలోవర్లు ఆమెకు ఉన్నారు. ఈ పాపులారిటీయే ఆమె పాలిట శాపంగా మారింది. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండే సుబ్రహ్మణ్యం.. భార్య సంపాదనపైనే ఆధారపడేవాడు. అయితే ఆమెకు వస్తున్న క్రేజ్‌ను చూసి అతను తట్టుకోలేకపోయేవాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. రెండేళ్ల క్రితం గొడవ పడి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సుబ్రహ్మణ్యం.. వారం క్రితమే తిరిగి వచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్య ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోయిన సుబ్రహ్మణ్యం.. ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
తన ప్లాన్‌లో భాగంగా.. నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేట కొడవలితో నాగలక్ష్మిపై దాడి చేశాడు. తల, మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. అనంతరం భయంకరమైన మెసేజ్‌ను తన చిన్న కొడుకుకు పంపాడు. “నేను, అమ్మ ఇక ఉండం.. నీ కోసం అన్నం పెట్టాను వచ్చి తిను” అని చెప్పి, మరో గదిలో తాను కూడా ఉరివేసుకున్నాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!