Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
- అసెంబ్లీకి తాగి వచ్చిన సీఎం భగవంత్ మాన్.?
- సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్, అకాలీ దళ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagwant Mann: కార్మిక దినోత్సవం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పంజాబ్‌లో సంచలనంగా మారాయి. ఈ సమావేశాల సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో పంజాబ్ అసెంబ్లీలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ముఖ్యమంత్రి మద్యం మత్తులో అసెంబ్లీకి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించడంతో వివాదం ఏర్పడింది. ఎమ్మెల్యేలందరికి ఆల్కాహాల్ మీటర్ టెస్ట్ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా డిమాండ్ చేశారు.
Read Also: Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
Also Read
- Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
శిరోమణి అకాలీ దళ్ కూడా ముఖ్యమంత్రి మాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. కార్మిక దినోత్సవం రోజు భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి రావడం చాలా సిగ్గుచేటు అని ఆ పార్టీ పేర్కొంది. సభలో ముఖ్యమంత్రి తీరును ప్రజలు గమనించాలని అన్నారు. నిజం బయటపెట్టేందుకు పంజాబ్ సీఎంకు ప్రజల ముందు డోప్ టెస్ట్ నిర్వహించాలని అకాలీ దళ్ డిమాండ్ చేసింది.
ఇటీవల ఆప్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో కలకలం చెలరేగింది. తాజాగా సీఎం భగవంత్ మాన్‌పై ఇలాంటి విమర్శలు రావడంతో మరోసారి ఆ పార్టీ వివాదంలో చిక్కుకుంది. ఈ ఆరోపణలపై భగవంత్ మాన్ స్పందిస్తూ, ప్రత్యేక సమావేశం కార్మిక దినోత్సవానికి అంకితమని, సభ్యులందరూ వాదనలకు దూరంగా ఉండి సభలో హుందాతనాన్ని పాటించాలని కోరారు.
తాజావార్తలు
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!