Bihar : చికెన్ మసాలా కొనేందుకని వెళ్తే… కిడ్నాప్ చేసి హోంగార్డుకు పెళ్లి చేశారు
- హోంగార్డును కిడ్నాప్ చేసిన దుండగులు
- స్కార్పియోలో తీసుకెళ్లి పెళ్లి చేసిన వైనం
- నలుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
- పెళ్లి తర్వాత పరారీలో కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బలవంతపు పెళ్లిళ్ల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ పెళ్లిళ్లలో అమ్మాయిలనే ఎక్కువగా బలవంతం చేసి పెళ్లిళ్లు చేస్తుంటారు. అమ్మాయి ఇష్టం లేకపోయినా కిడ్నాప్ చేసో లేక బెదిరించో పెళ్లి చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయిలను కూడా కిడ్నాప్ చేసి పెళ్లిళ్లు చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అబ్బాయి అనుమతి లేకుండానే తప్పని సరి పరిస్థితుల్లో అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వస్తుంది. బీహార్ రాష్ట్రంలో తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. భాగల్‌పూర్‌లో షాపుకని వెళ్తే అక్కడ హోంగార్డును కిడ్నాప్ చేశారు. ఆపై కిడ్నాపర్లు అతన్ని 100 కిలోమీటర్ల దూరంలోని పూర్నియాకు తీసుకెళ్లారు. అక్కడ అతడికి బలవంతంగా పెళ్లి జరిపించారు.
ఈ ఘటన నవాడా సమీపంలో చోటుచేసుకుంది. బాధితుడు, హోంగార్డు సుమిత్ కుమార్, నవ్‌గాచియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సకుచా నివాసి. సుమిత్ సోదరుడు వీరేంద్ర ఫిర్యాదు పై నవ్‌గాచియా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సుమిత్ హోంగార్డు శిక్షణ పూర్తి చేసుకున్నాడని, సోమవారం నుంచి నవ్‌గాచియా పోలీస్ స్టేషన్‌లో చేరాల్సి ఉందని చెప్పాడు. అయితే అంతకుముందే అతడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
Read Also:AP NDA Leaders: శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక.. గవర్నర్కు లేఖ
సుమిత్ ఏమయ్యాడు?
వీరేంద్ర మాట్లాడుతూ.. ‘నా సోదరుడు సుమిత్ తన కజిన్ ప్రభాస్ కుమార్‌తో కలిసి బైక్‌పై జగత్‌పూర్‌లోని తన మేనమామ గౌతమ్ యాదవ్ ఇంటికి వెళ్లాడు. సుమిత్ దగ్గర తన మేనమామ లక్ష అప్పు చేశాడు. వాటిని వసూలు చేసేందుకు వెళ్లాడు. మామ డబ్బుతో పాటు రెండు కోళ్లను కూడా ఇచ్చాడు. సుమిత్ ఇంటికి వెళ్లి చికెన్ వండుకుంటానని అనుకున్నాడు. దీంతో బైక్‌ను దారిలో ఆపేశాడు. చికెన్ మసాలా కొనడానికి షాప్ వైపు వెళ్లాడు. అప్పుడు స్కార్పియోలో వచ్చిన కొందరు వ్యక్తులు తుపాకీతో సుమిత్‌ను బెదిరించి బలవంతంగా కారులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. కిడ్నాపర్లలో గోపాల్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడు. సుమిత్‌ను పూర్ణియ వద్దకు తీసుకెళ్లి గోపాల్ యాదవ్ కుమార్తెతో బలవంతంగా పెళ్లి చేశారు. ఈ క్రమంలో సుమిత్‌తో పాటు అతడి బంధువులను కూడా కొట్టారు.
పెళ్లి చేసి పారిపోయారు
పెళ్లి తర్వాత సుమిత్‌ను మార్గమధ్యంలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సుమిత్ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నాలుగు గంటల తర్వాత సుమిత్, అతని సోదరుడు కోలుకున్నారు. ఈ కేసులో ధోబినియాకు చెందిన గోపాల్ యాదవ్, రోహిత్ యాదవ్, భిలి కుమార్, అశ్వని కుమార్‌లను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితులందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సుమిత్‌కి ప్రధమ చికిత్స నిర్వహించారు.
Read Also:MP: పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కి.మీ మేర వ్యాపించిన పొగలు
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!