MP: పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కి.మీ మేర వ్యాపించిన పొగలు
- మధ్యప్రదేశ్ లో భారీ అగ్రిప్రమాదం
- పీవీసీ పైపుల ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు
- 12ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న బృందాలు
- 10కిమీ మేర వ్యాపించిన పొగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం ఏడు గంటలకు మంటలు చెలరేగగా, అప్పటి నుంచి అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పైపుల ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగడంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో పైపులను ఉంచడంతో వాటికి అంటుకుని మంటలు భీకర రూపం దాల్చాయి. 10 కిలోమీటర్ల దూరం వరకు పొగలు కనపడడాన్ని బట్టి మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయో అంచనా వేయవచ్చు. 12కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతోపాటు ఇసుక, నురగతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫ్యాక్టరీలో ఉద్యోగులు లేరు
సిగ్నెట్ పీవీసీ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి ఉద్యోగుల షిఫ్ట్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. దీంతో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అందువల్ల ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేరు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఇసుకతో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం
మూడు పోలీసు స్టేషన్ల పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ధార్, పితంపూర్, ఇండోర్, బద్నావర్ నుండి ఫైర్ ఇంజన్లను పిలిపించారు. కానీ, పెద్దఎత్తున మంటలను అదుపు చేయలేకపోయారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీకి చెందిన అగ్నిమాపక దళం కూడా మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉంది. అనంతరం ఇసుకతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం డంపర్ల నుంచి ఇసుకను తెప్పించారు.
Read Also:Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారనికి మెగాస్టార్ కు ప్రత్యేక ఆహ్వానం..
పైపులు బయటకు తీస్తున్నారు
ఫ్యాక్టరీ లోపల ఉంచిన ప్లాస్టిక్ పైపులను వ్యవసాయానికి వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పైపులను బయటకు తీస్తున్నారు. దాని వల్ల మంటలు మరింత వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
స్పందించిన మంత్రి కైలాష్
మంత్రి కైలాష్ విజయవర్గియా ధార్ జిల్లాలోని పితాంపూర్‌లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఇండోర్ నుంచి ఐదు ఫోమ్‌లు నింపిన వాహనాలు, వాటర్ ట్యాంకర్లను పంపించారు. అవసరమైతే మరింత సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వం, పరిపాలన అలర్ట్ గా ఉన్నాయన్నారు.
Read Also:Balmoori Venkat: తప్పుడు ప్రచారాలు చేయకండి.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!