సంతానం లేని వారు సమాజంలో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కుంటుంటారు. అయితే ఈ బాధలను తొలగించుకునేందుకు కొందరు ఐవీఎఫ్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం వస్తున్న జంటలకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు. సొంత స్పెర్మ్ కాకుండా, పరాయి వ్యక్తుల స్పెర్మ్ తో సంతానం కలిగిస్తూ వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారు కొందరు వైద్యులు. తాజాగా సికింద్రాబాద్ లో దారుణం వెలుగుచూసింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో సంతానం లేని ఓ మహిళ తన భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని వైద్యురాలిని కోరారు.
Also Read:Donald Trump: వలసలను ఆపకుంటే యూరప్ నాశనం..ట్రంప్ బిగ్ వార్నింగ్..
అయితే, చికిత్స అనంతరం అనుమానం వచ్చిన ఆ దంపతులు, కడుపులో ఉన్న శిశువుకు డీఎన్ఏ టెస్ట్ చేయించారు. ఈ టెస్టులో వచ్చిన ఫలితాలు వారికి షాకిచ్చాయి. శిశువు డీఎన్ఏ, భర్త డీఎన్ఏతో సరిపోలకపోవడం, వేరే వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు తేలడంతో దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బెజవాడలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు లింకులు వెలుగు చూశాయి. కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నుంచి బెజవాడ వచ్చారు. టెస్ట్ ట్యూబ్ సెంటర్ కి చెందిన మహిళ డాక్టర్ ఆచూకీ బెజవాడలో గుర్తించారు.
Also Read:Mahavatar Narsimha : నెమ్మదిగా థియేటర్లు పెరుగుతున్నాయ్!
డాక్టర్ ను హైదరాబాద్ పోలీసులకి అప్పగించారు బెజవాడ పోలీసులు. గతంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై వచ్చిన ఫిర్యాదులపై బెజవాడ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో విశాఖలో ఒక కేసుకు సంబంధించి సృష్టి డాక్టర్ అరెస్ట్ అయ్యారు. 2018లో ఐదేళ్ల పాటు హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ఆ తర్వాత 2020లో డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని ఆసుపత్రి నిర్వహించినట్టు గుర్తించారు పోలీసులు. తాజా ఘటనతో ఆసుపత్రి లైసెన్స్ వ్యవహారంతో పాటు బ్రాంచిలో ఎంత మంది పిల్లలకు జన్మించారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు.