సంతానం లేని వారు సమాజంలో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కుంటుంటారు. అయితే ఈ బాధలను తొలగించుకునేందుకు కొందరు ఐవీఎఫ్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం వస్తున్న జంటలకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు. సొంత స్పెర్మ్ కాకుండా, పరాయి వ్యక్తుల స్పెర్మ్ తో సంతానం కలిగిస్తూ వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారు కొందరు వైద్యులు. తాజాగా సికింద్రాబాద్ లో దారుణం వెలుగుచూసింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో…