Cyber Crime: రెచ్చిపోతోన్న సైబర్ నేరగాళ్లు.. లక్షలు లాగేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరిత ప్రకటనలతో అమాయకుల నుంచి లక్షల రుపాయలు కాజేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చొని కొందరికి టోకరా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా దోచేస్తున్నారు. ఓ యువతి నుంచి ఏకంగా 20 లక్షలు, మరో యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.
బెజవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఈ నెల 5న వాట్సాప్ నెంబర్ ద్వారా మేసేజ్ వచ్చింది. తమ సంస్ధలో పార్ట్‌టైమ్ ఉద్యోగం ఉందన్నది ఆ మెసేజ్ సారాంశం. దీంతో ఆ మెసేజ్‌కు యువతి స్పందించింది. దీంతో రెండు యూ ట్యూబ్ లింక్‌లను ఆమెకు పంపారు. ఆ వీడియోలకు లైక్ కొడితే.. 150 రుపాయలు చెల్లిస్తామన్నారు. అయితే, ముందుగా వెయ్యి రూపాయలు చెల్లించాలని.. షరతు పెట్టారు. దీంతో ఆమె వెయ్యి రూపాయలు చెల్లించింది. తర్వాత యూ ట్యూబ్ లింకులకు లైకులు కొట్టింది. దీంతో ఆమె ఖాతాలో 13 వందల రుపాయలు డిపాజిట్ అయ్యాయి. తర్వాత ఆమెతో 5 వేల రుపాయలు పెట్టుబడి పెట్టించారు. ఈ సారి 7 వేల రుపాయలు వేశారు. ఇలా.. సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో చిక్కుకున్న యువతి. వాళ్లు చెప్పినంత డబ్బు డిపాజిట్ చేస్తూ వచ్చింది. దఫాదఫాలుగా సుమారు 20 లక్షల రుపాయలు ఆమె డిపాజిట్ చేసింది. కానీ.. అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. విజయవాడ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.
Also Read
పోరంకి ప్రాంతానికి చెందిన ఓ మహిళను కూడా ఇదే తరహాలో మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. వర్క్ ఫ్రం హోం… పార్టు టైం ఉద్యోగం పేరుతో సుమారు నాలుగు లక్షల రుపాయలు కాజేశారు. అలాగే, విజయవాడకు చెందిన ఓ యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేసింది ముఠా. సైబర్ నేరగాళ్లతో చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. మాటల్లో పెట్టి మోసాలకు పాల్పడతారని హెచ్చరిస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లను నమ్మోద్దంటున్నారు. ముఖ్యంగా వాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. లేదంటే బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేస్తారని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!