Best Selling Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్లో జనవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో నెక్సాన్‌కు పెరుగుతున్న ఆదరణ ఈ ఫలితంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో మారుతి సుజుకి డిజైర్ రెండో స్థానంలో, టాటా పంచ్ మూడో స్థానంలో నిలిచాయి. మరి ఏ కారు ఎన్ని అమ్ముడయ్యో చూద్దామా..
టాటా నెక్సాన్:
టాటా నెక్సాన్ అండ్ నెక్సాన్ EV కలిపి జనవరి 2026లో మొత్తం 23,365 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 15,397 యూనిట్లతో పోలిస్తే 51.75% వృద్ధి నమోదైంది. ఈ మోడల్ 12.91% మార్కెట్ షేర్‌ను సాధించింది.
T20 World Cup 2026: ఈసారి టీ20 వరల్డ్ కప్ మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మారుతి సుజుకి డిజైర్:
రెండో స్థానంలో నిలిచిన డిజైర్ జనవరి 2026లో 19,629 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 15,383 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇది 27.6% వృద్ధిను సూచిస్తుంది. డిజైర్ 10.85% మార్కెట్ షేర్‌ను పొందింది.
టాటా పంచ్ / పంచ్ EV:
మూడో స్థానంలో ఉన్న టాటా పంచ్, పంచ్ EV కలిసి 19,257 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జనవరిలో ఇవి 16,231 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 18.64% పెరుగుదలను చూపిస్తుంది. మార్కెట్ షేర్ 10.64%గా ఉంది.
హ్యుందాయ్ క్రెటా / క్రెటా EV:
హ్యుందాయ్ క్రెటా, క్రెటా EV నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ మోడల్ కార్లు 17,921 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది 18,522 యూనిట్లతో పోలిస్తే 3.24% తగ్గుదల నమోదైంది. ఈ మోడల్ 9.91% మార్కెట్ షేర్‌ను సాధించింది.
మారుతి సుజుకి ఎర్టిగా:
మారుతి సుజుకి ఎర్టిగా ఐదో స్థానంలో నిలిచింది. జనవరి 2026లో 17,892 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది 14,248 యూనిట్లతో పోలిస్తే 25.58% వృద్ధి నమోదైంది. మార్కెట్ షేర్ 9.89%గా ఉంది.
వీటి తర్వాతి స్థానాలలో..
* మారుతి సుజుకి స్విఫ్ట్ 17,806 యూనిట్లు (6వ స్థానం).
* మారుతి సుజుకి బ్రెజ్జా 17,486 యూనిట్లు (7వ స్థానం).
* మారుతి సుజుకి బాలెనో 16,782 యూనిట్లు (8వ స్థానం).
* మహీంద్రా స్కార్పియో / స్కార్పియో N 15,542 యూనిట్లు (9వ స్థానం).
* విక్టోరిస్ 15,240 యూనిట్లు (10వ స్థానం).