గతంలో చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఇయర్ పాడ్స్, ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్లతో మాట్లాడుతున్నారు. సెల్ ఫోన్ ఎక్కడ వున్నా మంచి ఇయర్ ఫోన్స్ మన దగ్గర వుంటే ఆ సౌకర్యం వేరుగా వుంటుంది. ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌ఫోన్‌లు తప్పనిసరి అయిపోయాయి. యువతరానికి నచ్చేలా, వారు మెచ్చేలా ప్రముఖ కంపెనీలు మంచి నాణ్యత గల వైర్డ్ ఇయర్‌ఫోన్‌లను మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చాయి. ఫిలిప్స్, జేబీఎల్, బోట్, వన్ ప్లస్, బ్లూ ఫంక్త్ వంటి కంపెనీల ఇయర్‌ఫోన్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. మంచి నాణ్యత కలిగిన, మన్నికైన మరియు బడ్జెట్ ధరలకు లభించే టాప్ వైర్డు ఇయర్‌ఫోన్‌ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం..ఈ ఆర్టికల్ లోకి వెళ్ళిపోండి…
Read Also: Technology: Realme R100 స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ
Bluepunkt EM01 ఇయర్ ఫోన్
Bluepunkt మార్కెట్లోకి విడుదల చేసిన అతి తక్కువ ధర కలిగిన ఇయర్ ఫోన్ ఇది.Bluepunkt EM01… దీనిని అమెజాన్‌లో కేవలం రూ.399 కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఆకట్టుకునే సౌండ్ క్వాలిటీ కలిగి ఉంది. ఫిట్టింగ్ ఎంతో సౌకర్యవంతంగా వుంటుంది. ఇన్‌లైన్ మైక్ సపోర్ట్ ఆప్షన్ కూడా ఉండడం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.
BluepunktEM10
Bluepunkt కంపెనీకి చెందినవే BluepunktEM10 ఇయర్ ఫోన్స్. వీటి ధర కూడా తక్కువే అని చెప్పాలి. Bluepunkt EM01 ధర రూ.399 అయితే.. వీటి ధర రూ.499గా నిర్ణయించింది. దీనికి ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ మరియు లైన్ మైక్ సపోర్టు వుంది. ఈ ఇయర్‌ఫోన్ మంచి సౌండ్ క్వాలిటీని కలిగి ఉంది. యువతకు ఇది బాగా నచ్చుతుందని కంపెనీ చెబుతోంది.
OnePlus Nord Wired ఇయర్‌ఫోన్స్
సెల్ ఫోన్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను పొందింది One Plus. తాజాగా ఈ One Plus కంపెనీ మంచి క్వాలిటీ కలిగిన బ్రాండ్ వైర్డ్ ఇయర్ బడ్స్ విడుదలచేసింది. ఈ కంపెనీకి చెందిన ఈ నార్డ్ వైర్డ్ ఇయర్ బడ్స్ కూడా అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. వీటి ధరను కంపెనీ రూ.799 గా ప్రకటించింది. ఇవి మంచి వైర్డ్ ఇయర్‌ఫోన్స్ అని ఫీడ్ బ్యాక్ లభిస్తోంది. యువత వీటిని ఎక్కువగా బడ్జెట్ ధరలో కొనుగోలు చేస్తోంది. మీకు కావాలంటే ఈ బ్రాండ్ సెలక్ట్ చేసుకోవచ్చు.
Goo GoBase 400 ఇయర్ ఫోన్స్
తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో దొరుకుతున్న ఈ కంపెనీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్నాయి. వైర్డు ఇయర్‌ఫోన్ ధర రూ.349 గా ఉంది. ఇది నాయిస్ క్యాన్సిలింగ్ ఆప్షన్‌తో నాణ్యతలో మరింత ఆకట్టుకుంటుంది. అదనంగా, ఈ ఇయర్‌ఫోన్‌లో ఇన్-లైన్ మైక్ సపోర్ట్ ఉంది.
Philips Audio TAE1126
ఫిలిప్స్ కంపెనీ అన్ని విధాలుగా మంచి ఆదరణ పొందిన సంస్థ. ఈ కంపెనీ టీవీలు, ఫ్రిజ్ లు, ట్రిమ్మర్లు అందరి ఆదరణ పొందాయి. తాజాగా ఫిలిప్స్ సంస్థ నుంచి ఇయర్ ఫోన్ ను రూ.328 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది ఇన్-లైన్ మైక్ మద్దతుతో చెవులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. బయటి NOISE కంట్రోల్ సిస్టమ్ వుంది.
Ambrance వైర్డ్ ఇయర్ ఫోన్
అతి తక్కువ ధరకు ఇయర్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం Ambrance Wired Ear Phone మంచి సెలక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ ఫోన్ రూ.249 కే లభిస్తోంది. సిలికాన్ రబ్బరు వైర్లు, ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ సపోర్ట్ ను కలిగి వుంది. స్పష్టమైన ధ్వని కోసం ఇన్-లైన్ మైక్ వుంది. బడ్జెట్ ధరలో కావాలంటే ఇదే మంచి ఛాయిస్.