ఈ మూడు కలిపి చపాతీలు చేసుకొని రాత్రి తింటే ఎంతటి మొండి ఒళ్ళు అయినా కరుగుతుంది. ఇంటిల్లిపాది పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ నానుడి మనం పాత కాలం నుంచి వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో అందరికీ దీని విలువ బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే శరీరానికి పుట్టెడు రోగాలు. వాటిని వదిలించుకునే ఎందుకు? ఆసుపత్రులకు వెళితే లక్షలు ఖర్చు. అందుకే మనం తినే ఆహారాన్ని జాగ్రత్తగా చేసుకుంటే నాలుగు కాలాలు ఆరోగ్యంగా, హాయిగా జీవించొచ్చు.
ఈ స్పృహ చాలామందిలో కలిగిన ఏది తినాలి, ఏది మానేయాలి అనే విషయంలో సందేహం. ఎక్కువ శారీరక శ్రమ లేనివారు సాయంత్రం వేళ అన్నం మానేస్తే బెటర్ అని డాక్టర్ సలహా ఇస్తున్నారు. అందుకు బదులుగా చపాతీలు తినాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మనం తినే అన్నంలో చాలామటుకు పిండి పదార్థాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మాత్రమే శరీరానికి ఇస్తాయి.. కానీ శరీరానికి కావాల్సిన అన్నిరకాల పౌష్టిక ఇవ్వలేవు. అందుకే కేవలం అన్నం, కూర లేదా పప్పుతో తింటే సరిపోదు. వ్యాయామం సరిగ్గా లేకుండా బరువు తగ్గాలి అనుకునేవారు. కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ చాలా తక్కువ తినాలి. అధిక బరువును వదిలించుకునే క్రమంలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్‌లు, కాల్షియం, విటమిన్లు అన్ని మిస్ కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటూనే సన్న పడాలి అనుకునేవారు తినాల్సిన, బెస్ట్ నైట్ ఫుడ్ చపాతీలు.. చపాతీలు తింటే అధిక బరువు కొద్దిగా చెక్ పడుతుందని అందరూ చెబుతుంటారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు రాత్రివేళ చపాతీలు మాత్రమే తినాలని డాక్టర్‌లు కండీషన్‌గా చెబుతుంటారు. కేవలం గోధుమ పిండితో చేసిన చపాతీలు అన్నం కన్నా కొద్దిగా బెటర్ కానీ.. అద్భుతమైన ఆహారం మాత్రం కాదు.
మరి అద్భుతమైన ఆహారం ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండికి, అర కప్పు రాగిపిండి, అరకప్పు జొన్న పిండి కలిపి చక్కటి చపాతీలు చేసుకోవాలి. వాటిలోకి పప్పు లేదా ఉడకబెట్టిన కూరలు తింటే పొట్టలోని కొవ్వు అధిక బరువు తగ్గడంతో పాటు మంచి కాల్షియం పుష్కలమైన ప్రోటీన్‌లు లభిస్తాయి. ఇవి పెద్దలకే కాకుండా చిన్న పిల్లలకి కూడా ఖచ్చితంగా పెట్టాలి. దీనివల్ల మంచి ఎత్తు పెరగడమే కాకుండా ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది.