Airtel Rs 279 Prepaid Plan Details: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘భారతీ ఎయిర్‌టెల్’ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవలి కాలంలో ‘రిలియన్స్ జియో’ నుంచి ఎదురవవుతున్న పోటీ కారణంగా.. నిత్యం కొత్త ప్లాన్‌ను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.279తో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో రీఛార్జ్‌కు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఉండేలా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ఎయిర్‌టెల్ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 2జీబీ డేటా లభిస్తుంది. 2జీబీ డేటా పూర్తయ్యాక.. ఒక్కో ఎంబీకి 50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. 45 రోజుల్లో 600 ఎస్సెమ్మెస్‌లు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కో మెసేజ్‌కు రూ.1 ఛార్జ్ వర్తిస్తుంది.
Also Read: IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో కీలక మార్పు!
రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డేటా పెద్దగా ఉపయోగించకుండా.. కేవలం వ్యాలిడిటీ కావాలనుకునే వారికి మాత్రమే ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. డైలీ డేటా ఉపయోగించే వారికి ఈ ప్లాన్‌తో ఉపయోగం ఉండదు. రూ.279 ప్లాన్ తరహా ప్రయోజనాలతో ఎయిర్‌టెల్ ఇటీవల రూ.395ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ 70 వ్యాలిడిటీ 70 రోజులు.