NIA Searches: దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Searches: బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి. 2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తీవ్రవాదులు పరారయ్యారు. ఈ కేసులో గతేడాది అనుమానితుల ఇండ్లల్లో సోదాలు చేయగా.. భారీగా ఆయుధాలను గుర్తించారు NIA అధికారులు. 2024 జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసింది ఎన్ఐఏ.
2023, జులైలో లష్కరే తోయిబా తీవ్రవాది నజీర్ భావజాలానికి ఆకర్షితులై పనిచేస్తున్న ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7 పిస్తోళ్లు, 4 హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, 4 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు పోలీసులు.. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసు దార్యప్తులో భాగంగా..2024, జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసిన NIA అధికారులు… నిందితులకు పలు కేసుల్లో తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీన బెంగళూరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) జైలులో జీవిత ఖైదీలు, ఇద్దరు పరారీలో ఉన్నవారితో సహా ఎనిమిది మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చార్జిషీట్ దాఖలు చేసింది.
Also Read
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
Read Also: PM Modi: పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి బాధ్యతలు.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు
చార్జిషీట్లో చేర్చబడిన నిందితుల్లో కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన నజీర్ కూడా ఉన్నారు, అతను 2013 నుండి బెంగళూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. జునైద్ అహ్మద్ అలియాస్ జేడీ, సల్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.మరికొందరిని సయ్యద్ సుహైల్ ఖాన్ అలియాస్ సుహైల్, మహ్మద్ ఉమర్ అలియాస్ ఒమర్, జాహిద్ తబ్రేజ్ అలియాస్ జాహిద్, సయ్యద్ ముదస్సిర్ పాషా, మహ్మద్ ఫైసల్ రబ్బానీ అలియాస్ సాదత్లుగా గుర్తించారు. మొత్తం ఎనిమిది మంది నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగపత్రం నమోదు చేశారు.
తాజావార్తలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!