Health: ప్రస్తుతం చాలా మందిని బాధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. మారిన ఆహారపు అలవాట్లు అలానే పైబడిన వయసు కారణంగా చాలామంది కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల పయిన్కిల్లర్ స్ప్రేలు, ఆయింట్మెంట్లు, టాబ్లెట్స్ మొదలైన వాటిని ఉపాయాగిస్తున్నారు. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లు వీటివల్ల ఉపశమనం లభించక పోగా దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే మీకు తెలుసా? మనకి ప్రకృతి సహజ సిద్ధంగా ప్రసాదించిన పెయిన్ కిల్లర్ ఒకటుందని. అవును ప్రకృతి సహజ సిద్ధంగ ప్రసాదించిన ఔషధం కుప్పింటాకు. మరి కుప్పింటాకు ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Read also:Health tips: 150 వ్యాధులకు ఒకటే ఔషధం.. రణపాల మొక్క ఉపయోగాలు
కుప్పింట మొక్క ఆకులను సేకరించి ఆ ఆకుల నుండి రసం తీసి కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో కుప్పింటాకు రసాన్ని పూయడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఈ కుప్పింట మొక్క వేర్లతో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. అలానే దంత సమస్యలు తగ్గుతాయి. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. చిగుర్లు గట్టిపడి చిగుర్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని తల పైన రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల్ని మెత్తని పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ లో కొంచం పసుపు కలిపి ముఖాన్ని పూసుకోవాలి.10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పైన ఉండే మొటిమలు , మచ్చలు, అవాంఛిత రోమాలు తగ్గి మొఖం కాంతి వంతంగా మారుతుంది.
Read also:TS ICET: నేటి నుంచి ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్.. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200..
కుపోపిటాకులని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ఈ ఆకుల నుండి రసం తీసి ఆ రసంలో నిమ్మ రసాన్ని కలిపి చర్మ పైన పూయడం వల్ల గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. గోరుచుట్టు సమస్యతో బాధ పడేవాళ్లు ఈ ఆకుల రసాన్ని గోరు చుట్టూ పూసి కట్టు కట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పురుగులు , తేళ్లు వంటివి కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఈ ఆకుల రసాన్ని పూయడం వల్ల సమస్య ప్రాణాంతకంగా మారకుండా ఉంటుంది. ఈ చెట్టుని ప్రాంతాన్ని బట్టి కుప్పింటాకు, పిప్పింటాకు, హరిత మంజిరి, నురి పిండి అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.