TS ICET: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ రెండో రౌండ్ కౌన్సెలింగ్ నేటి (సెప్టెంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఐసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యార్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనలేని వారికి సెప్టెంబర్ 22న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఇవ్వబడింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 23న నిర్వహించబడుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారు సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని.. వారికి సెప్టెంబర్ 28న సీట్లు కేటాయిస్తారు. సీటు పొందినవారు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి సెప్టెంబర్ 28 నుంచి 30లోపు సంబంధిత కళాశాలకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 29 నుంచి 30 వరకు నేరుగా కాలేజీకి వెళ్లి మరోసారి సర్టిఫికెట్లు సరిచూసుకోవాలి. సీటు కేటాయింపును నిర్ధారించండి. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో నిర్వహించిన ‘టీఎస్ ఐసెట్-2023’ పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదల కాగా.. మొత్తం 61,092 మంది అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 6న, ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదటి రౌండ్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 15న సీట్ల కేటాయింపు జరిగింది. ఎంబీఏలో 87.33 శాతం కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కాగా, ఎంసీఏలో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. ఐసెట్‌లో 61,092 మంది ఉత్తీర్ణత సాధించగా, 31,552 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఎంబీఏలో 24,029 సీట్లలో 20,985, ఎంసీఏలో 3,009 సీట్లు భర్తీ అయ్యాయి. వీరిలో 902 మందికి ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు వచ్చాయి. మొత్తం 255 కాలేజీల్లో 80 చోట్ల అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారు సెప్టెంబర్ 20లోపు ఫీజు చెల్లించి 29, 30 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ఐసెట్ చివరి రౌండ్ కౌన్సెలింగ్‌కు 10,762 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 729 MCA , మిగిలినవి MBA సీట్లు ఉన్నాయి.
షెడ్యూల్ ఇలా..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్: 22.09.2023.
➥ స్లాట్ బుకింగ్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్: 23.09.2023.
➥ వెబ్ ఎంపికల నమోదు: 22.09.2023 – 24.09.2023.
➥ ఫ్రీజింగ్ ఎంపికలు: 24.09.2023.
➥ సీట్ల కేటాయింపు: 28.09.2023.
➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: 28.09.2023 – 30.09.2023.
➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 29.09.2023 – 30.09.2023.
Health tips: 150 వ్యాధులకు ఒకటే ఔషధం.. రణపాల మొక్క ఉపయోగాలు