పుదీనా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి కృషి చేస్తుంది.. పుదీనాలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.. వేసవిలో పుదీనా నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుదీనా ఆకులకు అజీర్ణం, అపానవాయువు, ఉదర ఆమ్లం వంటి జీర్ణ సమస్యలను నయం చేసే శక్తి ఉంది. పుదీనా ఆకులు సహజంగా ఆకలిని అణిచివేసే గుణం కలిగి ఉంటుంది.. అందుకే రోజూ ఈ ఆకులను ఏదొక రూపంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. పుదీనా నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా రోజంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.. ఉదర సమస్యలను తగ్గించడంలో పుదీనా బాగా పనిచేస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేలా పనిచేస్తుంది. పుదీనా ఆకుల్లోని మెంథాల్.. వేసవిలో ఎండల తీవ్రతకు వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. టాక్సిన్స్ ను శుభ్రమ్ చెయ్యడంలో సహాయ పడతాయి.. పుదీనా నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చర్మం వేసవిలో పొడి బారకుండా హైడ్రెడ్ గా ఉండేలా చేస్తుంది… ముఖ్యంగా దాహన్ని తీర్చడంలో సహాయ పడుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.