Bellamkonda Sai Sreenivas: మరో బ్లాక్ బస్టర్ తమిళ్ రీమేక్‌లో బెల్లంకొండ హీరో!
- డిసాస్టర్‌గా ఛత్రపతి రీమేక్
- లైన్‌లో వరుస సినిమాలు
- రీమేక్ సినిమాలో బెల్లంకొండ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Sai Sreenivas To Act in Garudan Remake: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఛత్రపతి డిసాస్టర్‌గా నిలవడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా.. కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్‌ను పిక్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఇక బెల్లంకొండ హీరో మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టారని తెలుస్తోంది. రీసెంట్ తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘గరుడన్’ రీమేక్‌లో బెల్లంకొండ హీరో నటించనున్నారట. ఈ సినిమా హక్కులను కేకే రాధామోహన్ తీసుకున్నారని, విజయ్ కనకమేడల డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ్ చిత్రం రాచ్చసన్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రిలీజ్ చేసి సాయి శ్రీనివాస్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ తమిళ్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారట.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరో!
గరుడన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ కథను అందించగా.. ఆర్ఎస్ దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో సూరి, శశికుమార్‌తో పాటు ఉన్ని ముకుందన్ హీరోలుగా నటించారు. మే 31న థియేటర్లలో రిలీజైన గరుడన్ పెద్ద హిట్‌గా నిలిచింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. యాభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చెన్నై సిటీలో మధ్యలో ఉన్న కోట్ల విలువైన భూమిని తన సొంతం చేసుకోవడానికి మినిస్టర్ ప్రయత్నిస్తుండగా.. మినిస్టర్‌ను ఎదురించే క్రమంలో ముగ్గురు స్నేహితులు ఎందుకు శత్రువులుగా మారారు?, ఈ పోరాటంలో వారు ఎలాంటి కష్టాలు పడ్డారు? అన్నదే ఈ మూవీ కథ.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!