NTV Telugu Site icon

Beerla Ilaiah: ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్.. బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు

Beerla Ilaiah

Beerla Ilaiah

బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దందాల కోసం, కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజా పాలనకోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తాడని దుయ్యబట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు మనుగడ లేదు.. కేటీఆర్, హరీష్ రావు, సురేష్ రెడ్డిలు గల్లీలో మొఖం లేకనే ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు. గ్రామాల్లో తిరగలేక, తిరిగే మొఖం లేక ఢిల్లీ బాట పట్టారని మండిపడ్డారు.

Read Also: Supreme court: పతంజలిపై విచారణ.. ఉత్పత్తుల్ని నిలిపివేసినట్లు సంస్థ వెల్లడి

బీజేపీతో దోస్థానం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని బీర్ల ఐలయ్య తెలిపారు. ఏ మొఖం పెట్టుకొని ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారన్నారు. ఒక ఎంపీ సీటు ఐనా గెలిచారా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందే బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా అని విమర్శలు గుప్పించారు. ప్రజా పాలన చూసి, సంక్షేమ పథకాలు చూసి భాగస్వామ్యులు కావడానికి ఈ రోజు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడట్లేదని చెప్పారు.

Read Also: PM Modi: రష్యా మాకు ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’’.. ‘డిస్కో డాన్సర్‌’ గురించి ప్రస్తావన..

ఎలక్షన్ వస్తే కేసీఆర్ పాద యాత్ర చేస్తాడు.. పది ఏండ్లలో ఏ జిల్లాలో పర్యటించలేదని ఆయన తెలిపారు. తెలంగాణ సొత్తును మొత్తం దోచుకపోయారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టాడని.. అందుకే ఓర్వలేకనే తమ పైన బురుద జల్లుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేస్తుంటే కళ్లు మండుతున్నాయి, ఓర్వలేక పోతున్నారని బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.