ITR Filing: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023. ప్రస్తుతం ఆ తేది ముగిసిపోయింది. అయినప్పటికీ ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు. దీని కోసం ప్రజలు కూడా ఒక ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రజలు తమ ఆదాయాలను వెల్లడించనట్లయితే.. ఇప్పుడు లేట్ ఫీజు చెల్లించడం ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. దీనికి కూడా ఒక నిర్దిష్ట తేదీ ఉంది.
జూలై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులు కూడా ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. ఈ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను 31 డిసెంబర్ 2023లోపు సమర్పించగలరు అటువంటి దాఖలుపై నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వేతన ఉద్యోగులకు రూ. 5000 వరకు ఆలస్య రుసుము విధించబడుతుంది. ఇది కాకుండా రూ. 5 లక్షల కంటే తక్కువ పన్ను విధించదగిన ఆదాయం ఉన్న వ్యక్తులు రూ. 1000 జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.
Read Also:Gold Today Rate: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
పన్ను విధించదగిన ఆదాయం సంవత్సరానికి 5 లక్షల కంటే తక్కువ ఉంటే ఆదాయపు పన్ను చట్టాలు మినహాయింపును అనుమతిస్తాయి. అయితే, సంబంధిత సెక్షన్ల కింద మినహాయింపును క్లెయిమ్ చేయడానికి పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. జరిమానా లేకుండా ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31 సోమవారం. అయితే, నికర పన్ను విధించదగిన ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, ఒక వ్యక్తి రూ. 1,000 జరిమానాతో డిసెంబర్ వరకు ITRని ఫైల్ చేయవచ్చు.
మరోవైపు, మీరు ఆలస్య రుసుములతో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసినప్పుడు, మీరు ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలో గుర్తుంచుకోండి. ప్రస్తుతం, కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం ప్రకారం.. ఆదాయపు పన్ను రిటర్న్‌లను వివిధ పన్ను శ్లాబ్‌ల క్రింద దాఖలు చేస్తున్నారు.
Read Also:Multibagger Stocks: ఈ మెటల్ స్టాక్ పై పెట్టుబడి పెట్టిన వారు కోటీశ్వరులయ్యారు.. 3ఏళ్లలో 20రెట్లు