Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!
- బి12 లోపం లక్షణాలు ఇవే
- నరాలపై ప్రభావం ఎలా?
- బి12 పెంచే సూప్‌లు
- వైద్యుల కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరానికి అవసరమైన అత్యంత కీలకమైన పోషకాల్లో విటమిన్ బి12 ఒకటి. ఇది లోపిస్తే కేవలం నీరసం మాత్రమే కాదు, నేరుగా నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కాళ్లలో సూదులు గుచ్చినట్లు అనిపించడం, నడకలో వణుకు, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, ముఖ్యంగా కొన్ని రకాల సూప్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్లు వివరిస్తున్నారు.
Palnadu Ra*pe Case: మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో కీలక మలుపు.. అదుపులో అనుమానితుడు..!
Also Read
- Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
- Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
విటమిన్ బి12 లోపంతో వచ్చే ప్రధాన సమస్యలు:
- శరీరంలో బి12 స్థాయిలు తగ్గితే మెదడు , నరాల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. దీనివల్ల:
- కాళ్ల పాదాల్లో తిమ్మిర్లు రావడం, మొద్దుబారిపోవడం.
- నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం లేదా వణుకు రావడం.
- విపరీతమైన అలసట, చర్మం రంగు మారడం, బరువు తగ్గడం.
- కండరాలు లోపల నుండి బలహీనపడటం.
బి12 స్థాయిలను పెంచే అద్భుత సూప్‌లు:
1. చికెన్ బోన్ బ్రోత్ సూప్ (Chicken Bone Broth): చికెన్ ఎముకలను చాలా గంటల పాటు తక్కువ మంటపై మరిగించడం ద్వారా ఈ సూప్‌ను తయారు చేస్తారు. ఇందులో విటమిన్ బి12తో పాటు కొల్లాజన్ (Collagen) , అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ప్రయోజనం: ఇది దెబ్బతిన్న నరాలను బాగు చేయడానికి, కండరాలను లోపలి నుండి దృఢపరచడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మనం తీసుకునే ఆహారం నుండి బి12ను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది.
2. పాలకూర సూప్ (Spinach Soup): శాఖాహారులకు పాలకూర ఒక అద్భుత వరం. ఇందులో ఐరన్, మెగ్నీషియం , నైట్రేట్లు అధికంగా ఉంటాయి.
ప్రయోజనం: ఇవి రక్త ప్రసరణను వేగవంతం చేసి కండరాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు, నీరసం , వణుకును తగ్గించడంలో పాలకూర సూప్ తక్షణ ఫలితాన్ని ఇస్తుంది.
విటమిన్ బి12 సహజంగా మాంసం, గుడ్లు, పాలు వంటి జంతు సంబంధిత ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ లోపం తీవ్రంగా ఉన్నట్లయితే కేవలం ఆహారంపైనే ఆధారపడకుండా, వైద్యుల సలహాతో సరైన సప్లిమెంట్లను తీసుకోవడం శ్రేయస్కరమని డాక్టర్ శ్రీవత్స సూచించారు. రోజువారీ ఆహారంలో పైన పేర్కొన్న సూప్‌లను భాగంగా చేసుకోవడం వల్ల నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..