NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- నల్సార్ యూనివర్సిటీలో వివాదం..
- కాన్వొకేషన్ ముఖ్య అతిధిగా సీజేఐ సూర్యకాంత్‌పై అభ్యంతరం..
- ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోమని లేఖ..
- ఇటీవల పరిణామాలపై విద్యార్థుల నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NALSAR: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) యూనివర్సిటీ 2026 కాన్వొకేషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించడంపై వివాదం నెలకొంది. 2026 బ్యాచ్‌కు చెందిన 450 మందికిపైగా విద్యార్థులు యూనివర్సిటీ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోరుతూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, ఇతర అధికారులకు లేఖ సమర్పించారు.
యువతను ‘‘బొద్దింకలుగా’’ పిలవడం, ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు దాడికి సంబంధించి అంశాలపై సీజేఐ సరిగా వ్యవహరించలేదని విద్యార్థులు చెబుతున్నారు. జూలై 23న జరిగిన జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ మార్చ్‌లో పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలు చూడటానికి సీజేఐ సూర్యకాంత్ నిరాకరించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ‘‘మాకు వీడియోలపై ఆసక్తి లేదు. వాటిని చూడటానికి సమయం లేదు’’ అని ఆయన అన్నట్లు స్టూడెంట్స్ పేర్కొన్నారు.
Also Read
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
- Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
భారత యువతను బొద్దింకలుగా పోల్చినట్లు విద్యార్థులు ప్రస్తావించారు. ఈ విషయాలపై సీజేఐ సున్నితత్వం చూపలేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ తేదీ, ముఖ్య అతిథి ఎంపికా ఇంకా అధికారికంగా పూర్తి కాలేదని, తుది నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థులు లేఖలో కోరారు. తమ అభ్యంతరం సీజేఐ హోదాపై కాదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఇటీవల విచారణల్లో ఆయన వ్యవహరించిన తీరు, తాము విశ్వసించే రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉందా? అనే దానిపై ప్రశ్న అని తెలిపారు. పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలను పట్టించుకోనట్లు కనిపించే వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీలు అందుకోవడం.. తాము న్యాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న విలువలకు విరుద్ధంగా ఉంటుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, దాదాపు రెండు వారాల క్రితం ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) తన 86వ కాన్వొకేషన్‌ను చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఆగస్టు 2న జరగాల్సిన ఈ కార్యక్రమానికి సీజేఐ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉందని సమచారం. నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో, భద్రతా ఏర్పాట్ల కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చర్చ జరిగింది.
తాజావార్తలు
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!