Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే సరికొత్త సంచలనాలకు చిరునామా. వైజాగ్ వేదికగా జరిగిన మల్టీప్లెక్స్ లాంచ్ ఈవెంట్లో తన అభిమానులకు, సినీ ప్రియులకు ఆయన ఊహించని బిగ్ అప్డేట్ ఇచ్చారు. కార్యక్రమం ముగింపులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. తాను ఈ ఈవెంట్ కోసం ఎక్కడి నుంచో ప్రత్యేకంగా వచ్చింది లేదు… నేరుగా ‘రాకా’ చిత్ర షూటింగ్ స్పాట్ నుంచే వచ్చానని బన్నీ వేదికపై వెల్లడించారు. ప్రస్తుతం ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ ముంబై వేదికగా శరవేగంగా జరుగుతోందని చెప్పారు. “నేను నేరుగా ముంబైలో జరుగుతున్న ‘రాకా’ షూటింగ్ సెట్స్ నుంచే ఇక్కడికి వచ్చాను. వైజాగ్ ప్రజలను, అభిమానులను కలుసుకుని థియేటర్ లాంచ్‌ను పూర్తి చేసుకోవడం నాకు చాలా ముఖ్యం. అందుకే ‘సార్, మా వైజాగ్ వెళ్ళాలి… ప్రజలందరినీ ఒకసారి పలకరించి, థియేటర్ లాంచ్ పూర్తి చేసి వచ్చేస్తాను’ అని దర్శకుడిని కోరి ఒక్క రోజు బ్రేక్ తీసుకుని వచ్చాను. మళ్ళీ రేపటి నుంచే నాన్ స్టాప్ షూటింగ్లో పాల్గొంటున్నాను” అని ఐకాన్ స్టార్ పేర్కొన్నారు.
సినిమా షూటింగ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వైజాగ్ ప్రజలతో ఉన్న అనుబంధం కోసం ప్రత్యేకంగా ఒక రోజు షూటింగ్‌కు విరామం ఇచ్చి రావడం బన్నీ అంకితభావానికి, అభిమానుల పట్ల ఆయనకున్న ప్రేమకు అద్దం పడుతోంది. డైరెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మరీ ఈ వేడుకకు వచ్చా అని చెప్పడం గమనార్హం. వేదికపై బన్నీ నోటి వెంట ‘రాకా’ అనే పేరు వినపడటంతోనే అక్కడ ఉన్న అభిమానుల కేరింతలతో ప్రాంగణం హోరెత్తిపోయింది. ఏ మాత్రం సమయం వృధా చేయకుండా, తిరిగి రేపటి నుంచే ముంబైలో ‘రాకా’ షూటింగ్లో జాయిన్ అవుతున్నట్లు చెప్పడం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!