Rahane-Sehwag: మాటలు వద్దు, ఆడి చూపించు.. కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్ ఫైర్!
- కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస పరాజయాలు
- ముంబై, సన్‌రైజర్స్ చేతిలో కేకేఆర్ ఓటమి
- కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో కేకేఆర్ ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి అనంతరం కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేసిన వారిపై జింక్స్ ఫైర్ అయ్యాడు. తన సక్సెస్ చూడలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, తాను క్రికెట్ ఆడటం కొందరికి నచ్చడం లేదంటూ మండిపడ్డాడు. ఈ వ్యాఖ్యలు అభిమానులను మాత్రమే కాకుండా క్రికెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి.
అజింక్య రహానే వ్యాఖ్యలపై తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘ఒక ఆటగాడికి ప్రశంసలు, విమర్శలు రెండూ సహజం. అన్నింటికీ తటస్థంగా ఉండాలి. ప్రతీ విమర్శకు స్పందించడం అవసరం లేదు. కెప్టెన్‌గా మరింత హుందా తనంతో వ్యవహరించాలి. రహానె కెప్టెన్ కాబట్టి గ్రీన్ గురించి ప్రెస్ మీట్‌లో అడిగారు. క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి అనే అతడి సమాధానం బాగుంది. స్ట్రైక్ రేట్‌పై వచ్చిన ప్రశ్నకు రహానే ఇచ్చిన సమాధానంలో స్థిరత్వం లోపించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు’ అని వీరూ చురకలు వేశాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!
అలానే ప్రముఖులు విమర్శలను ఎలా ఎదుర్కొన్నారో ఉదాహరణలతో సెహ్వాగ్ వివరించాడు.’సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ వంటి మహానుభావులు విమర్శలపై ఎప్పుడూ మౌనం పాటించారు. విమర్శలను హుందాగా ఎదుర్కొన్నారు. తమ పనితోనే సమాధానం ఇచ్చారు. ఓ సమయంలో టెండూల్కర్ ఫామ్ లేకుండా ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో ఓ పత్రిక ఎండూల్కర్ అని విమర్శించినా ఆయన ప్రతిస్పందించలేదు. తన ఆటతోనే విమర్శకుల నోరు మూయించాడు. వివాదాలకు వెళ్లడం కన్నా మైదానంలో మంచి ప్రదర్శన చేయడం ఉత్తమం. ఒక సెంచరీ కొడితే విమర్శలు అన్నీ ఆగిపోతాయి’ అంటూ రహానేకు సెహ్వాగ్ సూచనలు చేశాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!