BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- లైంగిక వేధింపుల నిరోధానికి కొత్త ఇంటర్నల్ కమిటీ
- ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో కొత్త నియామకాలు
- 2028 శతాబ్ది వేడుకలకు ఇప్పటి నుంచే రోడ్‌మ్యాప్
- అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు వేతన పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి 95వ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబైలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ముగిసింది. బోర్డు పాలన, ఆర్థిక వ్యవహారాలు, మ్యాచ్ అధికారుల సంక్షేమం , రాబోయే ప్రతిష్టాత్మక టోర్నీల నిర్వహణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఈ సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం లభించింది.
లైంగిక వేధింపుల నిరోధానికి కొత్త ఇంటర్నల్ కమిటీ
క్రీడాకారులు , సిబ్బంది రక్షణకు సంబంధించిన అంశాలపై బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు లైంగిక వేధింపుల నిరోధక విధానం కింద నూతన ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయడానికి ఏజీఎమ్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు క్రికెటర్ల వయో నిర్ధారణ విధానంలో పారదర్శకత పెంచేలా పలు కీలక మార్పులను ఆమోదించింది.
Also Read
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నియామకాలు.. 2027 లీగ్‌పై ప్రత్యేక దృష్టి
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లోకి అరుణ్ సింగ్ ధుమాల్, ఎం. ఖైరుల్ జమాల్ మజుందార్లను ప్రతినిధులుగా నియమిస్తూ సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ ఎడిషన్ గ్రాండ్ మైలురాయిని పురస్కరించుకుని ఈ టోర్నీని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని బోర్డు నిర్ణయించింది. బిసిసిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2027 డిసెంబర్ నుండి 2028 వరకు సంవత్సరం పాటు ఈ శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు వేతన పెంపు
ఫీల్డ్‌లో మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించే అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు బిసిసిఐ తీపి కబురు అందించింది. వారి చెల్లింపులు పెంచడంతో పాటు అంపైర్లు, రిఫరీల గ్రేడింగ్ వ్యవస్థ పునర్వర్గీకరణకు సర్వసభ్య సభ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటెడ్ అకౌంట్లతో పాటు, 2026-27 వార్షిక బడ్జెట్‌ను , తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్ల నియామకాన్ని బోర్డు ఆమోదించింది. దీంతో పాటు దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధికి, వారికి అవసరమైన వనరులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర క్రికెట్ సంఘాలతో కలిసి సమగ్ర చర్యలు చేపడతామని వెల్లడించింది.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..