NTV Telugu Site icon

Ponnam Prabhakar : బీసీ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

Ponnam

Ponnam

Ponnam Prabhakar : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వచ్చే మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, చట్టాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో 96.9% మంది పాల్గొన్నారని, కేవలం 3.1% మంది మాత్రమే అందులో పాల్గొనలేదని వివరించారు. ఈ క్రమంలో, రెండో విడత కులగణన సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ హక్కులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Falcon Scam : ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు

తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టి దేశానికి దిక్సూచిగా నిలిచిందని పొన్నం ప్రభాకర్ గర్వంగా ప్రకటించారు. కులగణన సర్వేపై అనవసర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కూడా ప్రజల ప్రయోజనాలను గుర్తించి ఇందులో పాల్గొనాలని సూచించారు. ఈ గణన వల్ల బీసీల అసలైన జనాభా గణనలోకి వచ్చి, వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, తమిళనాడు తరహాలో షెడ్యూల్-9 పెట్టాలని కేంద్రాన్ని కోరతామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారం అందిస్తారని, అలాగే తెలంగాణ బీజేపీ నేతలు కూడా బీసీల ప్రయోజనాలను గుర్తించి రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.

సర్వేలో పాల్గొనడం వలన బీసీ జనాభా గణనకు సరైన దిశలో ఆందోళనలు నడిపించవచ్చని, బీసీల హక్కుల కోసం పోరాడే వారు తప్పకుండా ఇందులో పాల్గొనాలని మంత్రి అన్నారు. అయితే, ఈ సర్వేను అర్థం చేసుకోకుండా, రాజకీయ కారణాలతో విమర్శలు చేయడం సరైన ధోరణి కాదని చెప్పారు.

“తెలంగాణ జనాభాలో లెక్కల్లో లేకూడదని భావించే వారిని సర్వేలో పాల్గొనాలంటూ మేము బ్రతిమిలాడబోము. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ బీసీ సంఘాల నేతలు, మేధావులు, ప్రజలు అందరూ కలిసి సమగ్ర సర్వేలో పాల్గొని తమ హక్కుల కోసం కృషి చేయాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ బీసీలకు సముచిత హక్కులు, సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుతో పాటు, సర్వే ద్వారా వారికున్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని, భవిష్యత్తులో మరింత ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తామని తెలిపారు.

Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీకి క్షమాపణ చెప్పాలి