వారం రోజులైనా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగానే యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జ్యోతి మల్హోత్ర, సన్నీలను కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే మల్హోత్ర అరెస్టు చేసి జైలుకు పంపారు. వారం రోజులైనా సన్నీ యాదవ్ తమ దగ్గర ఉన్నాడని ఎన్ఐఏ చెప్పడం లేదు. పాకిస్థాన్లో వీడియోలు చేసి దుబాయ్ మీదుగా చెన్నైకి చేరుకున్నాడు భయ్యా సన్నీ యాదవ్.. పాకిస్థాన్లోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారితో సమావేశమైన వీడియోలు బయటికి వచ్చాయి. ఇతడితో సంబంధాలు ఉన్న వాళ్ళతో సమావేశంపై ఆరా తీస్తోంది ఎన్ఐఏ.
READ MORE: TDP Leader Brutally Murder: టీడీపీ నేత దారుణ హత్య.. ముక్కలుగా నరికి బోరుబావిలో వేసి..!
కాగా.. రెండ్రోల కిందట సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ఎన్టీవీతో మాట్లాడారు. భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని ఇంట్లో 29న గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు మా ఇంటికి కూడా వచ్చారన్నారు. కొన్ని పత్రాలు పరిశీలించారని మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మా అబ్బాయికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవు. సన్నీ యాదవ్ దేశ భక్తుడు.. పాకిస్తాన్ కు కేవలం బైక్ రైడర్ గానే వెళ్ళాడు.. పహల్గాం ఘటనకు ముందే పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాడని తెలిపాడు. ఎవరు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్తే.. నేను కూడా వారికి సహాకరిస్తానని తెలిపాడు. మా అబ్బాయి ఆచూకీ చెప్పాలి. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపాడు.