New Income Tax Bill 2025:లోక్‌సభలో సోమవారం నాడు కొత్త ఆదాయపు పన్ను (Income Tax No. 2) బిల్లు, 2025 ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ కొత్త బిల్లు 1961లో అమల్లోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టాన్ని పూర్తిగా భర్తీ చేయనుంది. ఈ బిల్లులో లోక్‌సభ సెలెక్ట్ కమిటీ సూచించిన దాదాపు అన్ని సిఫార్సులు, అలాగే పన్ను చెల్లింపుదారులతో పాటు ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన సూచనలు కూడా చేర్చబడ్డాయి. ఈ బిల్లుతో పాటు టాక్సేషన్ లాజ్ (Amendment) బిల్లు కూడా లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు పన్ను మినహాయింపులు కల్పించడమే లక్ష్యంగా తీసుకవచ్చారు.
కొత్త బిల్లులో ప్రధాన మార్పులు:
సెలెక్ట్ కమిటీ నాలుగు నెలలపాటు పరిశీలించి 4,500 పేజీల నివేదికతో 285కుపైగా సిఫార్సులు చేసింది. ఇవి చట్ట భాషను సులభతరం చేయడం, స్పష్టత ఇవ్వడం, పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చడం లక్ష్యంగా తీసుక వచ్చారు. కొత్త చట్టంలో మొత్తం 536 సెక్షన్లు, 16 షెడ్యూల్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా గత ఏడాది (Previous Year), ప్రస్తుత ఏడాది (Assessment Year) స్థానంలో ఇకపై ఒక్కటే “Tax Year” కాన్సెప్ట్ ఉంటుంది. వీటిలో అవసరం లేనివి, పరస్పర విరుద్ధమైన నిబంధనలు తొలగించబడ్డాయి. అలాగే CBDTకి తగిన విధంగా కొత్త రూల్స్ రూపొందించే అధికారం ఇచ్చారు.
Ambati Rambabu: మా కార్యాలయానికే వచ్చి ‘కాల్చిపారేస్తా’ అంటారా..? డీఎస్పీ వ్యాఖ్యలపై అంబటి ఫైర్..!
ముఖ్యమైన సిఫార్సులు:
ఇక ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లులో కొన్ని సిఫార్సులు కూడా అందించారు. ఇందులో టాక్స్ రీఫండ్ సంబంధించి సడలింపు చేశారు. ఒకవేళ ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసిన వారికి కూడా రీఫండ్ హక్కును కల్పించారు. అలాగే డివిడెండ్ రిలీఫ్ విషయంలో రూ.80 మిలియన్ల ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్లపై మినహాయింపు పునరుద్ధరణ చేశారు. అలాగే పన్ను కట్టాలిసిన అవసరం లేని వారికి ముందుగానే NIL-TDS ఆప్షన్ కింద సర్టిఫికేట్ పొందవచ్చు. ఇంకా ఖాళీ ఇల్లు పన్ను మినహాయింపు కలిపించారు. అలాగే హౌస్ ప్రాపర్టీ డిడక్షన్ స్పష్టతను తీసుకొచ్చారు. ఇందులో మున్సిపల్ పన్నులు తీసేసి 30% స్టాండర్డ్ డిడక్షన్, అద్దె ఇళ్లపై వడ్డీ మినహాయింపు ఇవ్వనున్నారు. MSME చట్టానికి అనుగుణంగా మార్చడం జరిగింది.