Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్సీ బస్వరాజు.. కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. తాను కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజల మద్దతు ఎవరి వైపు ఉందో ఎన్నికల ద్వారా తేల్చుకుందామని బస్వరాజు వ్యాఖ్యానించారు.
కొండా సురేఖపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య.. ఇన్ని సంవత్సరాలు ప్రజల రక్తం తాగిన మీరు ఇప్పుడు బీసీ కార్డును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇంకా ఎన్నాళ్లు బీసీ కార్డును వాడుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే తాను ఊరుకోబోనని హెచ్చరించారు. కొండా సురేఖపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది తానేనని వెల్లడించారు. బ్లాక్మెయిల్ కల్చర్‌కు పాల్పడేది మీరేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో చోటుచేసుకున్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ బస్వరాజు సారయ్య ప్రశ్నలు సంధించారు. 250 మూగజీవాలను కాల్చింది ఎవరు?, కాలిపోయిన స్థలం ఎవరి పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉంది? అంటూ ప్రశ్నించారు. ఈ సవాల్‌పై కొండా సురేఖ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!