ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని స్థానిక కోర్టు వరకట్న హత్య కేసులో మరణించిన మహిళ భర్త, అత్తమామలకు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన భర్త దర్శన్ సింగ్ (29), అతని తల్లి కమలేష్ దేవి (63)లకు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభయ్ శ్రీవాస్తవ తీర్పు చెప్పారు.
READ MORE: CP Srinivas Reddy: గుజరాత్‌లో 10 రోజుల పాటు ఆపరేషన్.. వెయ్యి కేసుల్లో నిందితులు అరెస్ట్
బరేలీ నగరంలోని సిబిగంజ్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్.. తన కుమార్తెకు చనేటా గ్రామానికి చెందిన దర్శన్ సింగ్‌తో 2020లో వివాహం జరిపించారు. పెళ్లయినప్పటి నుంచి కూతురిని భర్త, అత్తగారు వేధించేవారని బాధితురాలి తండ్రి ప్రమోద్ పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్, రూ.2 లక్షలు ఇవ్వాలని వేధించారు. దీంతో బాధితురాలు ఆందోళన చెందుతూ ఉండేది. వరకట్న డిమాండ్ నెరవేరకపోవడంతో.. నిందితులు ఫిబ్రవరి 6, 2021న బాధితురాలిని హత్య చేశారు. పోస్టుమార్టంలో బాధితురాలి మెడపై తాడు గుర్తులు కనిపించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏడుగురు సాక్షులను హాజరుపరిచింది. అనంతరం కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు 2021లో ఫతేగంజ్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ప్రభుత్వ అసిస్టెంట్ అడ్వకేట్ అనూప్ కొహర్వాలా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నేడు జీవిత ఖైది విధిస్తూ.. తీర్పు వెలువడిందని పేర్కొన్నారు.
READ MORE: Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?
కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా నుంచి గత వారం మరో వరకట్న మరణ కేసు వెలుగులోకి వచ్చింది. కట్నం డిమాండ్‌తో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడైన భర్తతో పాటు అతని ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు, బాధితురాలు 2019 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కట్నం కోసం డిమాండ్ మొదలైంది. నెరవేరకపోవడంతో ఇటీవల హత్య చేశాడు.
