Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth Movie Remuneration News: రజనీకాంత్ తన స్టైల్ డాషింగ్ పెర్ఫార్మెన్స్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. 45 ఏళ్లకు పైగా సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్న రజనీ బాక్సాఫీస్ కింగ్ కూడా. రజనీ సినిమా అంటే కచ్చితంగా బాక్సాఫీస్ హిట్ అవుతుందనేది నిర్మాతల ఆశ. రజనీకాంత్ చివరిగా విడుదలైన జైలర్ ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దీంతో నిర్మాతలు ఆయనకు భారీ పారితోషికం ఇస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడుగా ఉన్నారు రజనీ. నివేదికల ప్రకారం, అతను తన తదుపరి చిత్రం కూలీ కోసం 280 కోట్ల రూపాయలు అందుకున్నాడట. నేడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా గుర్తింపు పొందిన రజనీ తన కెరీర్ ప్రారంభంలో సినిమాకి కొన్ని వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. ముఖ్యంగా 16 ఏళ్ల వయసులో అనే సినిమాకి రజనీకి కేవలం 3000 మాత్రమే పారితోషికం ఇచ్చారంట.
Janhvi Kapoor: పుష్ప 2 ఐటమ్ సాంగ్ కి అడ్డుగా దేవర కాంట్రాక్ట్.. కానీ?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
రజనీ తొలిసారిగా 1975లో వచ్చిన భైరవి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. రజనీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ చిత్రానికి రజనీ కేవలం రూ.50 వేలు మాత్రమే చెల్లించారు. దీని తరువాత, రజనీకాంత్ పారితోషికం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే రజనీకాంత్‌కి ప్రియ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఎస్ బి ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పంచు అరుణాచలం నిర్మించారు. అప్పుడు పంచు అరుణాచలం రజనీని ప్రియా సినిమాలో నటించడానికి ఎంత పారితోషికం కావాలని అడిగాడు. అప్పుడు రజనీ మాట్లాడుతూ నాకు ఒక్కో సినిమాకు రూ.35000 ఇస్తున్నారని.. కానీ మీరు ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతుందని చెప్పారు. కాబట్టి రూ.15000 సరిపోతుందని చెప్పాడు. అప్పుడు పంచు అరుణాచలం “మీ మార్కెట్ పరిస్థితి మీకు తెలియదా? అక్కడ, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు మీ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి, లాభాలు పొందేందుకు పోటీ పడుతున్నారు. మీకు ఎవరూ చెప్పలేదా? మీకు రూ.లక్ష రెమ్యునరేషన్ ఉంది. అని చెప్పి రూ.1,10,000 చేతిలో పెట్టారట. అందుకు తగ్గట్టుగానే ప్రియా సినిమా కోసమే రజనీకాంత్ తొలిసారిగా రెమ్యునరేషన్ లక్ష దాటింది. ఇక అలా మొదలుపెట్టిన ఆయన నేడు అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..