Bihar : ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లోని ఆహారంలో పాము.. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు
- భోజనంలో విషపూరిత పాము
- అస్వస్థతకు గురైన విద్యార్థులు
- మెస్ యజమానికి జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బిహార్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ క్యాంటీన్ లోని ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. కాలేజీ విద్యార్థులు తినే ఆహారంలో విషపూరతిత పాము పిల్ల కనిపించింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆహారంలో చచ్చిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయమై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వారు వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మెస్ ఓనర్‌కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు.
Read Also:Gudivada Amarnath: ఋషికొండ కట్టడాలపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
బంకాకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఓ విద్యార్థి ఆహారంలో చనిపోయిన పాము పిల్ల కనిపించిందని సహచరులు చెప్పారు. ఈ విషయాన్ని ఇతర విద్యార్థులకు చెప్పగా వారంతా ఆందోళనకు దిగారు. క్యాంటీన్‌లో భోజనం నాణ్యతపై గతంలో కూడా కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కానీ దీనిపై ఏనాడూ దృష్టి పెట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించగా.. ఆహారంలో విషపూరిత పాము కనిపించింది. ఆహారంలో పాము కనిపించిన సమయానికి, కొంతమంది విద్యార్థులు అప్పటికే తమ భోజనాన్ని ముగించారు.
Read Also:Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో మరణించిన నక్సలైట్లలో ఆరుగురిపై రూ.48లక్షల రివార్డ్
తిన్న తర్వాత ఆ విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. వెంటనే 15 మంది విద్యార్థులను బంకాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులందరినీ తిరిగి కళాశాలకు పంపించారు. విషయం తీవ్రతను గమనించిన బంక సదర్ ఎస్‌డిఎం, ఎస్‌డిపిఓ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాసేపటి తర్వాత బంకా జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ కుమార్ కూడా కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఆహారంలో కనిపించింది విషపూరిత పాము పిల్ల అని ఇంకా నిర్ధారణ కాలేదని బంకా ఎస్డీఓ అభినాష్ కుమార్ తెలిపారు. ఆహార నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. అయితే ఆహారంలో నాణ్యత లేదని మెస్ యజమానికి జరిమానా విధించారు. విద్యార్థులను ఒప్పించిన తర్వాత మళ్లీ భోజనం సిద్ధం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్, విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!