NTV Telugu Site icon

IND vs BAN: ముగిసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్.. భారీ ఆధిక్యంలో భారత్

Ban

Ban

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల వద్ద బంగ్లా ఆలౌట్ అయ్యింది. 47.1 ఓవర్లకే భారత్ ఆలౌట్ చేసింది. దీంతో.. భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి బంగ్లా ఆటగాళ్లను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అత్యధికంగా షకీబ్ అల్ హసన్ (32), మెహిదీ హాసన్ మిరాజ్ (27), లిటన్ దాస్ (22) పరుగులు చేశారు.

Read Also: Sri Lanka: రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. పోలింగ్‌కి సర్వం సిద్ధం

శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో.. భారత జట్టు మొత్తం 376 పరుగులు చేసింది. ఆ తర్వాత.. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్, ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇస్లాం (2), జాకీర్ హాసన్ (3) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత కెప్టెన్ శాంటో (20) పరుగులు చేసి కాసేపు క్రీజులో నిలబడ్డాడు. మెమినుల్ హక్ డకౌట్ కాగా.. ముష్ఫిఖర్ రహీమ్ (8), హసన్ మమూద్ (9), టస్కిన్ అహ్మద్ (11), నహీద్ రానా (11) పరుగులు చేశారు.

Read Also: Delhi: పోలీసు అరెస్టును తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ నుంచి దూకి నేరస్థుడు మృతి..

Show comments