Pakistan-Bangladesh: దివాళా దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ జనవరి 29 నుంచి ఢాకా-కరాచీల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుల్ని ప్రారంభించనుంది. దశాబ్ధానికి పైగా రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు లేవు. గతేడాది షేక్ హసీనాను పదవి నుంచి దించేసిన తర్వాత, మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పెరిగాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత, హిందువులపై దాడులు పెరిగాయి.
Read Also: Krishna: బెజవాడ నడిబొడ్డున కృష్ణ విగ్రహం..ఆవిష్కరించనున్న కొత్త ఘట్టమనేని హీరో
ఇదిలా ఉంటే, ఈ రెండు దేశాలు తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతో నేరుగా విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించుకున్నాయి. మొదటగా వారానికి రెండుసార్లు గురువారం, శనివారాల్లో నడుస్తాయి. ఢాకా-కరాచీ మధ్య విమానాలను ప్రారంభించడానికి పాకిస్తాన్ నియంత్రణ సంస్థలతో చాలా నెలలుగా చర్చలు జరుగుతున్నట్లు బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ వెల్లడించింది.
ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం, రాత్రి 8 గంటలకు ఢాకా నుంచి బయలుదేరి రాత్రి 11.00 గంటలకు ఢాకా చేరుకుంటుంది. తిరిగి రాత్రి 12 గంటల నుంచి కరాచీ నుంచి బయలుదేరి ఉదయం 4.20 గంటలకు ఢాకా చేరుకుంటుంది. అయితే, ఢాకా నుంచి కరాచీ వెళ్లాలంటే భారత్ గగనతలాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రెండు నగరాల మధ్య దూరం 2370 కి.మీ అయితే, భారత్ నుంచి బంగ్లాదేశ్ క్లియరెన్స్ పొందిందో లేదో ఇంకా తెలియలేదు.