విజయవాడ నగరంతో ఘట్టమనేని కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది, ఇప్పుడదే నగర నడిబొడ్డున లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం కొలువుదీరనుంది. ఈనెల 11వ తేదీన జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు.
ALso Read:Jana Nayagan : వాయిదా దెబ్బతో 50 కోట్లు వెనక్కి..జన నాయగన్ సెన్సేషనల్ రికార్డ్
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అగ్నిపర్వతం’ సినిమా విడుదలై 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో జై కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక విజయవాడలోని సినిమా థియేటర్లు, ఇక్కడి ప్రముఖులతో కృష్ణ గారికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆదిశేషగిరిరావు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.