PAK vs BAN: పాకిస్థాన్ పై మరుపురాని విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్..
- రెండు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెట్ జట్టును 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం.
- రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా సాధించింది.
- టెస్ట్ ఫార్మాట్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK vs BAN: రెండు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెట్ జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా సాధించింది. టెస్ట్ ఫార్మాట్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఇకపోతే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తన అతి ఉచ్చాహంతో తొలి ఇన్నింగ్స్ ను 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఆతిథ్య జట్టులో సౌద్ షకీల్ (141), మహ్మద్ రిజ్వాన్ (171*) అద్భుత సెంచరీలు చేశారు. మొదట్లో కేవలం 16 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన పాకిస్థాన్ జట్టు ఆ తర్వాత కోలుకుంది. ఇక తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆధిక్యంలో నిలిచింది. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో ముష్ఫికర్ రహీమ్ భారీ సెంచరీ (191) చేశాడు. దింతో బంగ్లాదేశ్ కు తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
Tamil Nadu Accident: బస్సును ఢీకొన్న వ్యాన్.. గాల్లో ఎగిరిపడ్డ ప్రయాణికులు
Also Read
ఇక రెండో ఇన్నింగ్స్లో పాక్ బ్యాట్స్మెన్ నిరాశపర్చడంతో జట్టు మొత్తం 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ కు సులువుగా మ్యాచ్ విజయానికి కేవలం 30 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. 30 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి వికెట్ కోల్పోకుండా విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ ను ముగించడంలో మెహదీ హసన్ మిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ తన 11.5 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకుముందు, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్లో 1 వికెట్ తీసుకున్నాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!