బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఇరు టీంల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఆగస్టు 21- 25 మధ్య రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది.
PAK vs BAN: రెండు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెట్ జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా సాధించింది. టెస్ట్ ఫార్మాట్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఇకపోతే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తన…