Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..
- బీసీబీ కీలక నిర్ణయం..
- క్రికెటర్ల జీతాలు పెంచుతూ నిర్ణయం..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) దేశీయ క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ పెంపును తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలోని అడ్-హాక్ కమిటీ ఆమోదించింది.
మహిళా క్రికెటర్ల ఫీజుల్లో భారీ మార్పు..
ఇంతకుముందు మహిళా క్రికెటర్లకు ఒక వన్డే మ్యాచ్‌కు కేవలం 1,000 టాకాలు (సుమారు రూ.750) మాత్రమే ఇచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న తమీమ్ ఇక్బాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం.. మహిళల వన్డే మ్యాచ్ ఫీజు 1,000 నుంచి 15,000 టాకాలకు పెరిగింది. టీ20 మ్యాచ్‌కు 10,000 టాకాలు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు 20,000 టాకాలు చెల్లిస్తారు. టాప్ 36 మహిళా క్రీడాకారుల నెలవారీ జీతం (Retainer) 30,000 నుంచి 40,000 టాకాలకు పెరిగింది.
Also Read
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
- AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
పురుషుల క్రికెటర్ల జీతాల వివరాలు..
పురుషుల డొమెస్టిక్ క్రికెటర్ల జీతాలను కూడా పెంచారు. కేటగిరీ A ప్లేయర్లకు నెలకు 65,000 టాకాలు, కేటగిరీ B కి 50,000 మరియు కేటగిరీ C కి 40,000 టాకాలు లభిస్తాయి. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజును 70,000 నుండి 1,00,000 టాకాలకు (43% పెంపు) పెంచారు.
Also Read:Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..
తమీమ్ ఇక్బాల్ సంస్కరణలు..
ఆటగాళ్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువగా ఉందని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించడం బోర్డు బాధ్యత అని తమీమ్ పేర్కొన్నారు. కేవలం జీతాలే కాకుండా.. గత 18 నెలలుగా దెబ్బతిన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్పులు కేవలం ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు వస్తాయని ఆయన సూచించారు. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ దేశీయ క్రికెటర్లకు ఆర్థిక భరోసా లభించనుంది.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మెగా ప్లాన్..
-
RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!