Asian Games 2023: ఆసియా క్రీడల్లో బంగ్లాకు చుక్కలు చూపించిన మలేషియా క్రికెట్ జట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న టీమే కదా అని అంచనా వేస్తే.. సునామీ సృష్టించారు. ఆసియా క్రీడల్లో బంగ్లాతో జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో పసికూన మలేషియా.. బంగ్లాదేశ్ ను ఓడించినంత పని చేశారు. ఒకానొక సమయంలో ఈ మ్యాచ్ మలేషియా గెలుస్తుందని అనుకున్నప్పటికీ.. అఫీఫ్ హొస్సేన్ ఆల్‌రౌండ్ షో చేశాడు. బ్యాటింగ్ లో14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులతో చెలరేగగా.. బౌలింగ్ లో 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను ఆదుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. మరోవైపు అక్టోబర్ 6న జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ టీమిండియాతో తలపడనుంది.
Maharashtra: నాందేడ్ ఘటన మరవక ముందే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కరోజులో 23 మంది మృతి
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
బంగ్లా, మలేషియా మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేసింది. మలేషియా అద్భుత బౌలింగ్ తో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. బౌలర్లు పవన్‌దీప్ సింగ్ (4-1-12-2), విరన్‌దీప్ సింగ్ (4-0-13-0)తో మంచి ప్రదర్శన చూపించారు. ఇక.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సైఫ్ హస్సన్ (50 నాటౌట్), అఫీఫ్ హొస్సేన్ (23), షాదత్ హొస్సేన్ (21) పరుగులు చేశారు.
Nobel Prize 2023: రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్తలు వీరే..
ఆ తర్వాత 117 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన మలేషియా జట్టు.. 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో మలేషియా కష్టాల బాటలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన విరన్‌దీప్ సింగ్ (39 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చేశాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి మలేషియాను గెలిపించినంత పని చేశాడు. అయితే ఆఖరి ఓవర్లో అఫీఫ్ హొస్సేన్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. మలేషియా గెలుపుకు కావాల్సిన 5 పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్ లో కేవలం 2 పరుగులు ఇచ్చిన అఫీఫ్ హొస్సేన్.. విరన్‌దీప సింగ్ వికెట్ తీశాడు. దీంతో బంగ్లాదేశ్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!