NTV Telugu Site icon

Bandla Ganesh: గత ప్రభుత్వం పై బండ్ల గణేష్ ఫైర్.. అంత మాట అనేశాడు ఏంటి?

Bandla Ganesh

Bandla Ganesh

Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్, మాజీ మంత్రి మల్లారెడ్డిపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఇంద్రవెళ్లి సభకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందన్నారు. మతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారు మల్లారెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: CM Revanth Reddy: పోరు గడ్డ నుంచి ప్రచార హోరు.. ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం

రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీగా తెలంగాణను పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. రెండు నెలల రేవంత్‌రెడ్డి పాలన అద్భుతమని.. రాబోయే అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని బండ్ల గణేష్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ ఫీజుల రూపంలో విద్యార్థుల రక్తాన్ని పీల్చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి పాలనను చూసి గర్వపడుతున్నానని బండ్ల గణేష్ అన్నారు. పార్టీ తనకు మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తానని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే తీసుకునేది లేదని స్పష్టం చేశారు. డబ్బులున్నాయని అహంకారమా? అంటూ మండిపడ్డారు. గోవాలో వెళ్లి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అయినా ఇంత అహంకారం ఎందుకు సీఎం ను వాడు వీడు అని మాట్లాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Males Special Bus Stopped: మూడు రోజుల మచ్చటేనా ?.. నిలిచిపోయిన ‘మేల్స్ స్పెషల్’ బస్సు

Show comments