Bandi Sanjay : 2005 నుండి 2011 వరకు ఏడు సార్లు జైలుకు వెళ్ళొచ్చా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పఠాన్ చెరులో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నాను. అనంతరం ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా.. 120 ఏళ్ల క్రితం వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న, అమ్మవారిని చూడగానే నా ఒళ్ళు పులకరించిందన్నారు బండి సంజయ్. పంచభూతాలను దేవుడుగా ఆరాధించే సంస్కృతి మన హిందూ సంప్రదాయమని, 2005 నుండి 2011 వరకు హిందూ సాంప్రదాయాల పైన కొట్లాడి ఏడు సార్లు జైలుకు వెళ్ళొచ్చానన్నారు.
Also Read : Arvind Kejriwal: డర్టీ పాలిటిక్స్.. మనీష్ సిసోడియా అరెస్టుపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
Also Read
- Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్
- Earthquake: జపాన్‌లో 7.1తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
- Istamart CEO: ఇన్‌స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
- రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
హిందువు అనేవాడు, ఎవడైనా హిందు ధర్మాన్ని గానీ, హిందూ దేవుళ్లను గానీ, కించపరిచినప్పుడు ఎదురు తిరిగి సమాధానం చెప్పాలన్నారు. కాశీ మహానగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మోడీదని, జన్మలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలన్నారు బండి సంజయ్. అయ్యప్పను విమర్శించిన వాడి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసనని, ధర్మాన్ని కించపరిచినట్లు ఎవరు మాట్లాడిన వారికి అదే పరిస్థితి పడుతుందన్నారు.
Also Read : Kasturi: అనసూయ ఆంటీ వివాదంపై.. కస్తూరి ‘డర్టీ’ మీనింగ్
80శాతం హిందువులు ఉన్న భారతదేశంలో రామ మందిరం నిర్మించడానికి ఎన్నో కొట్లాటలు జరిగాయని, మూలాయం సింగ్ హయాంలోని రామ మందిర నిర్మాణం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆ రోజుల్లో నేను ఒక కర సేవకునిగా ఎన్నో దెబ్బలు తిన్నానని, ఈరోజు మనం రామ మందిరాన్ని ఎంతో సుందరంగా నిర్మించుకుంటున్నామన్నారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్
-
Istamart CEO: ఇన్‌స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
-
Earthquake: జపాన్‌లో 7.1తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
-
Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
-
Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!