Bandi Sanjay : ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. అయితే నేడు నాగోల్‌లో ప్రజా సంగ్రామ యాత్రలో సాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసిందన్నారు. ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్ఐ నడుస్తోందని, జిమ్, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్ఐ విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు. పీఎఫ్ఐను టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని,
హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణలో విస్తరిస్తుంటే కేసీఆర్ కు సిగ్గు లేదా? ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి సర్కార్ కు సోయి ఎందుకు లేదు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమేనని, హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమన్నారు.
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
కేంద్రం ఇండ్లు మంజూరు చేసినా లెక్క చెప్పని కేసీఆర్.. భూములున్నా పట్టాలివ్వని దుర్మార్గుడని ఆయన మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల బంద్ తో నానా అవస్థలు పడుతున్న వేలాది మంది బాధితులు.. కేసీఆర్ కుటుంబానికి లంచాలిస్తే తప్ప పనులు కాని దుస్థితి ఉందని ఆయన అన్నారు. కుక్క తోక వంకర తరహా కేసీఆర్ తీరు ఉందని, ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లను అరెస్ట్ చేసి జైళ్లో పెడతారా? అని ఆయన ధ్వజమెత్తారు. ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర అని, కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న కేసీఆర్…. లిక్కర్ స్కాంపై నోరెందుకు మెదపవు? సీబీఐ, ఈడీ దాడులు చూసి క్వారంటైన్ పోతున్న కేసీఆర్ కుటుంబం. సీఎం కుటుంబాన్ని తెలంగాణ పొలిమెర దాటేదాకా తరిమి తరిమి కొట్టేదాకా విశ్రమించబోమని ఆయన అన్నారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!