మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీపైనే కాకుండా టీపీసీసీ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అయితే.. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మర్రి శశిధర్ రెడ్డిపై ఆరేళ్లు బహిష్కరణ వేటు వేసింది. అయితే.. ఇప్పటికే అమిత్ షాతో భేటీ అయ్యి బీజేపీలోకి వెళ్లేందుక సిద్ధంగా ఉన్న ఆయన పై కాంగ్రెస్ బహిష్కరించడమేంటనీ ఆపార్టీ నేతలే చర్చించుకున్నారు. అయితే.. అందరూ అనుకున్నట్లుగానే నేడు బీజేపీలో చేరారు మర్రి శశిధర్ రెడ్డి. మర్రి శశిధర్ రెడ్డి జాయినింగ్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ లు పాల్గొన్నారు.
Also Read ” Group-4 Jobs : గ్రూప్-4 పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ పాలన చూసి మర్రి శశిధర్ రెడ్డి పార్టీలో చేరారన్నారు. మంచి ఆలోచనతో బీజేపీలో చేరారని, నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈరోజు దానికి విరుద్దంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. అవినీతి, కుటుంబం పాలన కొనసాగుతున్నదని, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ లు కలిసి బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. పాలన పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారన్నారు. మోడీని తిట్టడం లక్ష్యం పెట్టుకున్నారని, ప్రజల సమస్యను పక్కన పెట్టి విమర్శలు చేస్తున్నాడు.. సమస్యలను పక్కదారి పట్టించేందుకే రాజకీయ విమర్శలు చేస్తున్నారు కేసీఆర్ అని బండి సంజయ్ మండిపడ్డారు.