కేసీఆర్ 2018 లో మీటింగ్ పెట్టి 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, డిగ్రీ కాలేజ్ అన్నాడు, చిల్పూర్ గుట్ట అభివృద్ధి అన్నాడు, దళిత బంధు అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు , ఇచ్చారా, డబుల్ బెడ్ రూములు ఇచ్చారా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు వేసి గెలిపిస్తే, గెలిచినోడు ప్రగతి భవన్ కు వెళ్లి గళ్ళ పట్టి తన్నాలి అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న నాయకులు అందరూ వచ్చి, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి తిరుగుతున్నాడా, కనబడుతున్నాడా. ఈడీ అనగానే దడ పుట్టి చద్దరి కప్పుకొని పడుకున్నాడు. మునుగోడు అనగానే భయపడితే, ఇంట్లొళ్ళు వాళ్ళు బయటకి నెట్టి మీటింగ్ కు పంపిస్తే, మీటింగ్ ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి ఏమి ఇవ్వకనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. హుజురాబాద్ ఎలెక్షన్లలో మోటర్లకు, మీటర్లు పెడుతున్నారు అని అంటున్నాడు, ఎక్కడైనా పెట్టామా.. మునుగోడు లో కూడా అన్నాడు, పెట్టామా.. తాగి బండి నడిపితే నేరం అయినప్పుడు, తాగి రాష్ట్రాన్ని నడిపితే నేరమా, కాదా… మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం అన్నట్టైతే భద్రకాళి గుడి దగ్గరికి రా…ప్రమాణం చేద్దాం.. ఓల్డ్ సిటీకి వెళ్లి కరెంటు బిల్లు వసూలు చేస్తే దమ్ము లేని చేతకాని దద్దమ్మ కేసీఆర్.. వినాయక చవితి వస్తే పోలీస్, రెవిన్యూ కరెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఓల్డ్ సిటీ లో అడిగే దమ్ముందా..? తెలంగాణలో రైతులు చనిపోతే ఒక రూపాయి ఇయ్యని కేసీఆర్ పంజాబ్ లో చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి మూడు లక్షల ఇచ్చిన దద్దమ్మ కేసీఆర్. ఈ ప్రభుత్వం లో హిందువుల పండుగలు వస్తే పర్మిషన్లు తీసుకోవాలి.
టీఆర్‌ఎస్, సీపీఎం, కాంగ్రెస్ వాళ్ళు గుంటనక్కలు, నేను హిందువును, బిజెపి వాళ్లు సింహం లాంటోళ్లు ,నేను నా ధర్మం కోసం కొట్లాడుతా. టీఆర్ఎస్ కాంగ్రెస్ గుంపులు గుంపులుగా వస్తారు బీజేపీ మాత్రం సింగిల్ గా వస్తది.. 15 నిమిషాలు సమయమిస్తే హిందువులను చంపుతా అన్న ఒవైసీతో స్నేహం చేస్తున్నాడు. అందరూ భగవద్గీత మీద ప్రమాణం చేస్తే, ట్విట్టర్ టిల్లు మాత్రం అతని మనస్సాక్షి గా ప్రమాణం చేస్తాడట… దేవుడిని నమ్మని నాస్తికుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్. మనం రోజుకో దేవుణ్ణి మొక్కుతాం… గోమాత ను చంపి బిర్యానిసుకునుని తింటారట. బీజేపీ ఏ మతాన్ని కించపరుచదు. హిందూ ధర్మాన్ని కించపరిస్తే చూస్తూ ఉరుకొము, హిందువులు ఓటు బ్యాంకు గా మారాలి. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ కు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వండి, నిజాయితీ వంత పాలన చేస్తాము. అవినీతి, రజాకార్ల పాలనను తరిమికొట్టుతాము. పేదోళ్ళు అమరులైతే, పెద్దోళ్ళు గడ్డనెక్కారు, మాది పేదోళ్ల పార్టీ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.