బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల ప్రక్రియ ముగిసింది.. ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫిరెన్స్ జరిపాడు.. 8గంటల వరకు జరపాలని అంటున్నాడు.. ఓటు రెండు వేలు ఇచ్చి ఓటర్లను తీసుకురండి అని కేటీఆర్ చెప్పాడు.. బెదిరింపులు, ప్రలోభాలను అధిగమించి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ధన్యవాదాలు.. ఓటింగ్ ని వినియోగించి అందరికి మంచి మెసేజ్ ఇచ్చారు.. లాఠీ చార్జీలని తట్టుకుని పని చేసిన నా కార్యకర్తలు హీరోలు.. యువతకు నా ధన్యవాదాలు.. ఉపఎన్నిక మొదలైనప్పటి నుంచే టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు, మంత్రులు.. మొత్తం కేబినెట్ అంతా అక్కడే ఉంది.. ఎన్నికల కమిషనర్ కేసీఆర్ జేబు మనిషిగా మారిపోయాడు.. అనేక ఆధారాలతో కమిషనర్ కి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు.. గులాబీ నేతలకు, ప్రగతి భవన్ కు సీపీ, ఎస్పీ చాలా కస్టపడి గులాం గిరీ చేసారు.
Also Read : Munugode By Poll : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
వారికి ధన్యవాదాలు.. ఏడేళ్లు ఒకే దగ్గర ఉంచినందుకు గురిదక్షిణగా సీపీ ఈ ఎన్నికల్లో పని చేసారు.. సిద్ధిపేట నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తే బీజేపీ ఫిర్యాదు చేసింది.. దాంతో పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి బీజేపీ వాళ్ళని కొట్టారు.. ఎన్ని కుట్రలు చేసిన.. వందశాతం బీజేపీ గెలుస్తుంది.. రాజగోపాల్ రెడ్డి ఎమ్యెల్యే కాబోతున్నాడు.. ఇది ప్రజా నిర్ణయం.. టీఆర్ఎస్ నేతలు డిప్రెషన్లో ఉన్నారు.. అంబులెన్స్ లో, టీఆర్ఎస్ పార్టీ అధికార ఛానెల్లో డబ్బు తీసుకెళ్లారు.. ఈరోజు చండూరు లో మా కార్యకర్తలను కొట్టారు.. కవరేజ్ కి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ అరుణ్ ని కూడా లాకెళ్లారు.. మునుగోడుతో బిఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుంది.. ఒక గ్రామంలో ఓటుకు నలభై, యాభై వేలు ఇచ్చారు.. రాష్ట్రంలో నిస్సుగ్గుగా ఈ ఎన్నికల కోసం వెయ్యి కోట్లను కేసీఆర్ ఖర్చు చేసాడు..అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.