Site icon NTV Telugu

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కేసీఆరే తయారు చేస్తుండు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay On Amit Shah

Bandi Sanjay On Amit Shah

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ను కేసీఆరే తయారు చేస్తున్నడు అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకెట్ మనీ వెయ్యి కోట్లు ఇస్తుండని, పాపం కాంగ్రెస్ వాళ్లకు తెలియదన్నారు. కొంత మందికి తెలుసు కాని గెలిచాక ఎట్లాగు పోయేది అందులోకే కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారన్నారు. దోషిగా తేలితే బీజేపి చెప్పినా, కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా కవితను వదలరన్నారు. అంతేకాకుండా.. ‘ఈడీ ఇంకా విచారిస్తోంది. అదొక స్వతంత్ర సంస్థ బీజేపీకి సంబంధం ఉండదు… లిక్కర్ కేసుతో కవితకు సంబంధం లేదని తండ్రి కొడుకులు ఎందుకు చెప్పడం లేదు.

Also Read : Kishan Reddy : కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టు కోలేదు

బీఆర్ఎస్ బలహీనంగా ఉన్నచోట కాంగ్రెస్ ను కేసీఆరే లేపుతున్నాడు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని కేసీఆర్‌ నమ్మకం. కర్ణాటకలో ఓట్ల శాతం ఏమాత్రం తగ్గలేదు… ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఎక్కడైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనంగా ఉందని అనిపిస్తే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ లేపుతున్నాడని ఆ పార్టీ అభ్యర్థులకు డబ్బులు సమకూరుస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్యాకెట్ మనీ కిందనే 1000 కోట్లు ఇచ్చాడని బండి సంజయ్ ఆరోపించారు. కర్ణాటకలో జేడిఎస్ నేత కుమారస్వామిని సీఎం కేసీఆర్ మోసగించాడు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు సమయంలో కుమారస్వామిని వాడుకున్నాడని ఇప్పుడు కుమారస్వామి ఫోన్ కూడా కేసీఆర్ ఎత్తడం లేదు. కర్ణాటకలో తమ పార్టీకి ఓట్ల శాతం లో ఏమాత్రం బలం తగ్గలేదు. అక్కడ ఎంఐఎం కాంగ్రెస్, మరో పార్టీ ఒక్కటై ఎన్నికల్లో పోటీ చేయడం వల్లనే అనేక సీట్లలో స్వల్ప మెజార్టీతో తమ పార్టీ ఓటమి పాలయింది. లిక్కర్ స్కాం లోకవిత దోషిగా తేలితే ఎవ్వరు కాపాడ లేరు.
ఢిల్లీ లిక్కర్ కేసు ఇంకా తేలలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ సాగుతోందని ఆ కేసులో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే కాపాడాలని సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొని బతిమిలాడిన వదిలిపెట్టరు.’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Health Tips : వేసవి సెలవుల్లో బరువు పెరుగుతారని భయపడుతున్నారా?

Exit mobile version