Site icon NTV Telugu

Bandi Sanjay : బడ్జెట్‌పైన ఎక్కడా చర్చ లేదు… సీఎం మాట మీద ప్రజల్లో విశ్వాసం లేదు

Bandi Sanjay Formers

Bandi Sanjay Formers

బడ్జెట్ పైన ఎక్కడ చర్చ లేదు… సీఎం మాట మీద ప్రజల్లో విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తాజాగా ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు కేంద్రాన్ని, మోడీ ను తిట్టేందుకే పెటినట్టు ఉందని విమర్శించారు. కేసీఆర్ ఖాయల్ తప్పాడు… జనాలు నవ్వుకుంటున్న ఆయనకు సిగ్గు లేదు అంటూ మండిపడ్డారు బండి సంజయ్‌. అంతేకాకుండా..’పోడు భూములపై సీఎం మాట్లాడ్డానికి జ్ఞానం ఉండాలి. 8 ఏళ్ల నుండి పట్టాలు ఇవ్వనిది ఎవరు.. హామీ ఇచ్చింది ఎవరు. ఇప్పుడు మళ్లీ కొత్త లింక్ పెట్టాడు… పట్టాలు ఇవ్వక పోతే నీ ఫార్మ్ హౌస్ కి వచ్చి పేద ప్రజలు దున్నుతారు. కేసీఆర్@ మానవ మృగం. మత పరమైన రిజర్వేషన్ లకు బీజేపీ వ్యతిరేకం. బోయ వాల్మికులను ఇప్పటి వరకు ఎస్టీలలో ఎందుకు చేర్చలేదు.. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ మాట్లాడుతున్నారు.. వారం లోపు జర్నలిస్ట్ లకు ఇల్లు ఇవ్వక పోతే… నేను పీఎం అవాస్ యోజన కింద ఇల్లు తీసుకొస్తా.

Also Read : Jasprit Bumrah: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..చివరి రెండు టెస్టులకూ స్టార్ పేసర్ దూరం!

సెక్రటేరియట్‌ను ఎందుకు కూల్చావు… ఇంకా వంద సంవత్సరాలు ఉండేది… కారణం ఏంటి… సెక్రటేరియట్ కు రాని మీ అయ్యా ఎందుకు కూల్చాల్సి వచ్చింది… 15 వందల కోట్లు పెట్టావు… పోచమ్మ తల్లి దేవాలయంను కూల్చారు… పేదలకు ఉపయోగపడే ఉస్మానియా హాస్పిటల్‌ను ఎందుకు కూల్చి కొత్తది కట్టడం లేదు. కూలుస్తా అన్నది నువ్వే(కేటీఆర్) పాతబస్తీ నుండి ప్రారంభించు అని నేను అన్న. పాత బస్తీలో కరెంట్ బిల్లులు కట్టంది వాస్తవమే… వెయ్యి కోట్ల నష్టం వచ్చింది అని రిపోర్ట్ లే చెప్పాయి. పాత బస్తీలో ట్రిబుల్ రైడ్ చేయొచ్చు, విద్యుత్ చౌర్యం చేయొచ్చు, అస్తి పన్ను ఎగవేయ వచ్చు… బానిసత్వ మరకలను చెరిపి వేయడానికి మేము చూస్తున్నాం… నిజాం మరకలు ఇంకా ఉండాలని సీఎం చూస్తున్నారు’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు

Exit mobile version